Narendra Modi: 17వ లోక్‌సభలో ప్రధాని మోదీ చివరి ప్రసంగం.. ఏమన్నారో తెలుసా?

మరో పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదుగుతుందని చెప్పారు.

Narendra Modi: 17వ లోక్‌సభలో ప్రధాని మోదీ చివరి ప్రసంగం.. ఏమన్నారో తెలుసా?

PM Narendra Modi

Updated On : February 10, 2024 / 6:35 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో మాట్లాడారు. 17వ లోక్‌సభలో ప్రధాని మోదీ చేసిన చివరి ప్రసంగం ఇది. కొన్ని వారాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ జీ20 అధ్యక్ష పదవిని పొందిందని గుర్తుచేశారు.

దేశానికి గొప్ప గౌరవం లభించిందని, ప్రతి రాష్ట్రం భారతదేశ సామర్థ్యాన్ని, వారి సొంత గుర్తింపును ప్రపంచం ముందు ప్రదర్శించిందని తెలిపారు. 17వ లోక్‌సభను దేశం తప్పక ఆశీర్వదిస్తుందని తెలిపారు. మరో పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదుగుతుందని చెప్పారు.

గత ఐదేళ్లలో దేశానికి ఎంతగానో ఉపయోగపడే సంస్కరణలు తీసుకొచ్చామని మోదీ చెప్పారు. సమావేశాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. క్లిష్ట సమయాల్లో స్పీకర్ వ్యవహరించిన తీరు ప్రశంసనీయమని తెలిపారు. రాబోయే 25 ఏళ్లు భారత్ కు చాలా కీలకమని అన్నారు. కొత్త పార్లమెంట్ భవనం మనకు గర్వకారణంగా నిలిచిందని తెలిపారు.

ఎన్ని విపత్తులు ఎదురైనా అభివృద్ధి ఆగలేదని మోదీ చెప్పారు. దేశ ప్రజల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు. కరోనాలాంటి విపత్తులను జయించామని చెప్పారు.

తమ పాలనలో సంస్కరణలు, సమర్థవంతమైన పాలనపై దృష్టి సారించినట్లు మోదీ తెలిపారు. దేశ ప్రజలు స్వాతంత్ర్య సాధన లక్ష్యాలను నిత్యం స్మరించుకుంటున్నారని తెలిపారు. తాము డిజిటలైజేషన్‌తో పార్లమెంటులో కాగితాన్ని వాడడం లేదని చెప్పారు.

లోక్‌సభ సమావేశాలు నిరవధిక వాయిదా
లోక్‌సభ సమావేశాలు నిరవధిక వాయిదాపడ్డాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మరికొన్ని వారాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టింది.

CM Revanth Reddy: అందుకే ఇటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టాం: మీడియాతో రేవంత్ రెడ్డి