Parliament Winter Session: పట్టువీడని విపక్షాలు.. ఉభయసభలు రేపటికి వాయిదా.. మోదీ, అమిత్ షా భేటీ
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రతీరోజూ వాయిదా పడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. వీటి భేటీలో ..

parliament winter session
Parliament Winter Session 2024 : యూపీలోని సంభల్ లో చెలరేగిన హింస, అదానీపై అవినీతి ఆరోపణలు, తదితర అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చజరగాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి అదానీ అంశంపై చర్చకు విపక్ష పార్టీల సభ్యులు పట్టుడుతున్నారు. దీంతో అధికార, విపక్ష పార్టీల సభ్యుల మధ్య పార్లమెంట్ సమావేశంలో వాదోపవాదనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో సభలో గందరగోళం ఏర్పడుతుండటంతో స్పీకర్ సభను వాయిదా వేస్తున్న పరిస్థితి. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా సోమవారం కూడా ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో సమావేశాలు ప్రారంభమైన గంట వ్యవధిలోనే ఉభయసభలు రేపటి(మంగళవారం)కి వాయిదా పడ్డాయి.
Also Read: Pushpa 2 : లండన్ లో పుష్ప హవా.. లండన్ వీధుల్లో బన్ని ఫ్యాన్స్ డ్యాన్స్..
సోమవారం ఉదయం 11గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో అదానీ, సంభల్ లో హింసాకాండపై విపక్ష ఎంపీలు పట్టుపట్టడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సభ్యులు పెద్దెత్తున నినాదాలు చేయడంతోపాటు స్పీకర్ పలుమార్లు రిక్వెస్ట్ చేసినా వెనక్కు తగ్గలేదు. దీంతో మధ్యాహ్నం 12గంటల వరకు లోక్ సభ వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైన తరువాత కూడా విపక్ష ఎంపీలు తమ నిరసనను కొనసాగించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో చైర్మన్ జగదీప్ ధన్ఖర్ సభను రేపటికి వాయిదా వేశారు.
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రతీరోజూ వాయిదా పడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. వీరి భేటీలో.. ఉభయ సభలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇండియా బ్లాక్ ఎంపీలు సమావేశం అయ్యారు.