Petrol Price : దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతూనే ఉన్నది. దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.

Prtrol
Petrol and diesel prices hike : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతూనే ఉన్నది. దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
మంగళవారం లీటరు పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంచిన దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి ధరలను పెంచాయి. వినియోగదారులపై భారం మోపాయి. తాజాగా పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంచింది.
BJP MLA: టీఎంసీలోకి బీజేపీ ఎమ్మెల్యే.. గుండు గీయించుకుని పాపాలు పోయాయంటూ..
పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 102.95, లీటరు డీజిల్ ధర రూ.91.45కు పెరిగింది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.108.98, లీటరు డీజిల్ ధర రూ.99.18 పెరిగింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.107.08, డీజిల్ ధర రూ.99.75 పెరిగింది.
ఈ నెలలో లీటర్ పెట్రోల్ పై రూ.1.30 పెంపు, డీజిల్ పై రూ.1.65 పెరిగింది. 2021లో ఇప్పటి వరకు పెట్రోల్ పై లీటర్ రూ.19, డీజిల్ పై రూ.18 పెరిగింది.