Neeraj Chopra : నీరజ్ పేరుంటే చాలు.. రూ.501 పెట్రోల్ ఫ్రీ

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం తీసుకొచ్చిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాపై గుజరాత్‌లోని ఓ పెట్రోల్‌ బంకు యజమాని వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నాడు. భరూచ్‌లోని తన పెట్రోల్‌ బంకులో నీరజ్‌ పేరుతో ఉన్న వారికి రూ.501 మేర పెట్రోల్‌ ఉచితంగా కొట్టాడు.

Neeraj Chopra : నీరజ్ పేరుంటే చాలు.. రూ.501 పెట్రోల్ ఫ్రీ

Neeraj Chopra (3)

Updated On : August 10, 2021 / 1:57 PM IST

Neeraj Chopra : టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం తీసుకొచ్చిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాపై గుజరాత్‌లోని ఓ పెట్రోల్‌ బంకు యజమాని వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నాడు. భరూచ్‌లోని తన పెట్రోల్‌ బంకులో నీరజ్‌ పేరుతో ఉన్న వారికి రూ.501 మేర పెట్రోల్‌ ఉచితంగా కొట్టాడు.

ఇతర పేర్లు ఉన్నవారు కూడా పెట్రోల్ కోసం పేరు మార్చుకునే అవకాశం ఉండటంతో నీరజ్ అనే పేరు కలిగిన వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు జీరాక్స్ బంక్ లో ఇవ్వాలని తెలిపాడు. స్వతంత్ర భారత దేశంలో అథ్లెటిక్స్ లో తోలి బంగారు పతకం అందించిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించారు నీరజ్