ఏప్రిల్-11కు ఏర్పాట్లు పూర్తి….పోలింగ్ జరగనున్న స్థానాలివే

సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 20 రాష్ట్రాలలోని 91 లోక్ సభ స్థానాలకు గురువారం(ఏప్రిల్-11,2019)పోలింగ్ జరుగనుంది.అదేవిధంగా ఆంధ్రప్రదేశ్,ఒడిషా,అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం అసెంబ్లీ స్థానాలకు కూడా గురువారమే పోలింగ్ జరుగనుంది.
1.ఆంధ్రప్రదేశ్ లో….25 లోక్ సభ స్థానాలకు 45,920 పోలింగ్ సెంటర్లలో గురువారం పోలింగ్ జరగనుంది.319మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.టీడీపీ,వైసీపీ,జనసేన,కాంగ్రెస్,బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి.175 అసెంబ్లీ స్థానాలకు కూడా గురువారమే పోలింగ్ జరుగనుంది.
2.తెలంగాణలో….17 లోక్ సభ స్థానాలకు 34,603 పోలింగ్ సెంటర్లలో గురువారం పోలింగ్ జరగనుంది.443మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.టీఆర్ఎస్,కాంగ్రెస్,ఏఐఎమ్ఐఎమ్,బీజేపీలు ప్రధాన పార్టీలుగా పోటీలో ఉన్నాయి.
3.ఉత్తరప్రదేశ్ లో…8 లోక్ సభ స్థానాలకు 16,633 పోలింగ్ సెంటర్లలో గురువారం పోలింగ్ జరుగనుంది.96మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఎస్పీ,బీఎస్పీ,ఆర్ఎల్ డీ కూటమి,కాంగ్రెస్,బీజేపీలు ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి,
4.మహారాష్ట్రలో…7లోక్ సభ స్థానాలకు 14,731పోలింగ్ సెంటర్లలో గురువారం పోలింగ్ జరుగనుంది.122మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.బీజేపీ,ఎన్సీపీ,కాంగ్రెస్,శివసేన ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి.
5.జమ్మూకశ్మీర్ లో…2లోక్ సభ స్థానాలకు 3,489పోలింగ్ సెంటర్లలో గురువారం పోలింగ్ జరుగనుంది.33మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.పీడీపీ,జేకేఎన్ సీ కూటమి,జేకేఎన్ పీపీ ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి.
6.ఉత్తరాఖండ్ లో…5లోక్ సభ స్థానాలకు 11,235పోలింగ్ సెంటర్లలో గురువారం పోలింగ్ జరుగనుంది.52మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.బీజేపీ,కాంగ్రెస్,బీఎస్పీ ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి.
7.వెస్ట్ బెంగాల్ లో…2లోక్ సభ స్థానాలకు 3,844పోలింగ్ సెంటర్లలో గురువారం పోలింగ్ జరుగనుంది.18మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.తృణముల్ కాంగ్రెస్,లెఫ్ట్(సీపీఎం,ఆర్ఎస్ పీ,ఏఐఎఫ్ బి),బీజేపీ,కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి.
8.ఒడిషాలో….4లోక్ సభ స్థానాలకు 7,233పోలింగ్ సెంటర్లలో గురువారం పోలింగ్ జరుగనుంది.26మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.బీజేడీ,బీజేపీ,కాంగ్రెస్ లు ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి.147అసెంబ్లీ స్థానాలకు కూడా గురువారమే పోలింగ్ జరుగనుంది.
9.సిక్కింలో…1లోక్ సభ స్థానానికి 567 పోలింగ్ సెంటర్లలో గురువారం పోలింగ్ జరుగనుంది.11మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఎస్ డీఎఫ్,హెచ్ ఎస్ పీ,ఎస్ కేఎమ్,బీజేపీ,కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి.32 అసెంబ్లీ స్థానాలకు కూడా గురువారమే పోలింగ్ జరుగనుంది.
10.అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ లో…1లోక్ సభ స్థానానికి 406పోలింగ్ సెంటర్లలో గురువారం పోలింగ్ జరుగనుంది.15మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.బీజేపీ,కాంగ్రెస్,ఆమ్ ఆద్మీ,తృణముల్ కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి.
11.లక్ష్యద్వీప్ లో…1లోక్ సభ స్థానానికి 51పోలింగ్ సెంటర్లలో గురువారం పోలింగ్ జరుగనుంది.6మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.బీజేపీ,కాంగ్రెస్,ఎన్సీపీ ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి.
12.త్రిపురలో…1లోక్ సభ స్థానానికి 1,679పోలింగ్ సెంటర్లలో గురువారం పోలింగ్ జరుగనుంది.13మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.బీజేపీ,కాంగ్రెస్,సీపీఎం,తృణముల్ కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి.
13.నాగాలాండ్ లో…1లోక్ సభ స్థానానికి 2,227పోలింగ్ సెంటర్లలో గురువారం పోలింగ్ జరుగనుంది.ఇక్కడ కేవలం నలుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు.ఎన్ పీపీ,ఎన్ డీపీపీ ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి.
14.మిజోరాంలో…1లోక్ సభ స్థానానికి 1,175పోలింగ్ సెంటర్లలో గురువారం పోలింగ్ జరుగనుంది.6మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.బీజేపీ,కాంగ్రెస్,జెడ్ పీఎం కూటమి,ఎమ్ఎన్ఎఫ్ ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి.
15.మేఘాలయలో..,2లోక్ సభ స్థానాలకు 3,167పోలింగ్ సెంటర్లలో గురువారం పోలింగ్ జరుగనుంది.9మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఎన్ పీపీ,యూడీపీ,బీజేపీ,కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి.
16.మణిపూర్ లో…1లోక్ సభ స్థానానికి 1,300పోలింగ్ సెంటర్లలో గురువారం పోలింగ్ జరుగనుంది.8మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.బీజేపీ,కాంగ్రెస్,ఎన్ పీఎఫ్ ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి.
17.చత్తీస్ ఘడ్ లో…1లోక్ సభ స్థానానికి 1,878పోలింగ్ సెంటర్లలో గురువారం పోలింగ్ జరుగనుంది.7మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.బీజేపీ,కాంగ్రెస్,బీఎస్పీ ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి.
18.బీహార్ లో….4లోక్ సభ స్థానాలకు 7,486పోలింగ్ సెంటర్లలో గురువారం పోలింగ్ జరుగనుంది.44మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.బీజేపీ-జేడీయూ కూటమి,కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి.
19.అరుణాచల్ ప్రదేశ్ లో…2లోక్ సభ స్థానాలకు 2,202పోలింగ్ సెంటర్లలో గురువారం పోలింగ్ జరుగనుంది.12మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.పీపీఏ,బీజేపీ,కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి.60అసెంబ్లీ స్థానాలకు కూడా గురువారమే పోలింగ్ జరుగనుంది.
20.అస్సాంలో….5లోక్ సభ స్థానాలకు 9,574పోలింగ్ సెంటర్లలో గురువారం పోలింగ్ జరుగనుంది.41మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఏఐయూడీఎప్,బీజేపీ,కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి.
మొత్తం ఏడుదశలుగా జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు మే-19,2019న ముగుస్తాయి.మే-23న లోక్ సభ,అసెంబ్లీ ఫలితాలు వెలువడతాయి.