పాక్ పీఎంకి సీఎం సవాల్: మీ వల్ల కాకపోతే మసూద్ ను మేమే పట్టుకుంటాం
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఫైర్ అయ్యారు. పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ వ్యక్తుల హస్తం ఉందనడానికి ఆధారాలు ఉంటే ఇవ్వండి..

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఫైర్ అయ్యారు. పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ వ్యక్తుల హస్తం ఉందనడానికి ఆధారాలు ఉంటే ఇవ్వండి..
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఫైర్ అయ్యారు. పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ వ్యక్తుల హస్తం ఉందనడానికి ఆధారాలు ఉంటే ఇవ్వండి.. చర్యలు తీసుకుంటాం అని పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు పంజాబ్ సీఎం ఘాటుగా బదులిచ్చారు. పుల్వామా దాడికి సూత్రధారి, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాకిస్తాన్ లోని బహావల్‌పూర్‌లోనే ఉన్నాడని క్లూ ఇచ్చారు. ఐఎస్‌ఐ సాయంతో దాడులకు కుట్ర పన్నుతున్నాడని తెలిపారు. ముందు అతన్ని పట్టుకోండి అని డిమాండ్ చేశారు. మీకు చేతకాకపోతే మాకు చెప్పండి.. మేమే పట్టుకుంటాం అని సీఎం అమరీందర్ సవాల్ విసిరారు. ముంబై దాడి ఆధారాలు ఇచ్చాం కదా.. మరి దాని సంగతేమైంది అని పాక్ ప్రధానిని ప్రశ్నిస్తూ అమరీందర్ ట్వీట్ చేశారు.
పుల్వామా దాడికి తామే కారణం అని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ స్వయంగా ప్రకటించుకుంది. ఇది పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్న టెర్రరిస్టుల పనే అని భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలు అంగీకరించాయి. భారత్ కు మద్దతుగా నిలిచాయి. దీంతో డిఫెన్స్‌లో పడిపోయిన ఇమ్రాన్.. మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. పచ్చి అబద్దాలు మాట్లాడారు. అసలు ఈ దాడితో తమకేమీ సంబంధం లేదని కబుర్లు చెప్పారు. ఆధారాలు ఉంటే ఇవ్వండి.. విచారణ జరిపిస్తాం అని రొటీన్ డైలాగులు కొట్టారు. పైగా భారత్ యుద్ధానికి వస్తే తిప్పికొడతాం అని హెచ్చరికలు కూడా చేశారు.
ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా జిల్లాలో ఆత్మాహుతి దాడిలో 40మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనతో యావత్ దేశం ఆవేదనగా ఉంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ప్రతీకారంతో రగిలిపోతోంది. టెర్రరిస్టులను పెంచి పోషిస్టున్న పాకిస్తాన్ పై యుద్ధం చేయాల్సిందే అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.