పార్లమెంట్‌లో మోడీ చివరి స్పీచ్: టీడీపీ పోవడంతో మా టెన్షన్ పోయింది

లోక్‌సభలో బీజేపీ చేసిన పనులన్నింటినీ చర్చిస్తూ మాట్లాడిన పీఎం మోడీ.. టీడీపీ బీజేపీ వదిలేయడం టెన్షన్‌ను తగ్గించిందని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం తాము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. జీఎస్టీ బిల్లును అమలులోకి తీసుకువచ్చి దేశ ఆర్థిక వ్యవస్థలోనే మార్పులు వచ్చేలా చేశామన్నారు. టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి కమిటీ ఇచ్చిన సిఫార్సులను అభినందించారు. ఢిల్లీ 16వ లోక్ సభలో ప్రధాని మోడీ చివరి ప్రసంగం సాగిందిలా.
వందకువంద శాతం ప్రజల కోసం పని చేసి 85శాతం వరకూ పనులను పూర్తి చేశాం. ఈ సారి పార్లమెంట్‌లో మహిళలు అధికంగా ఉన్నారు. రక్షణ మంత్రి హోదాల్లో ఉండటం మనకు గర్వ కారణం. పర్యావరణ పరిరక్షణకు వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు భారత్‌ను మెచ్చుకుంటున్నాయి. 3 దశాబ్దాల తర్వాత పూర్తి స్థాయి మెజార్టీతో ఉన్న ప్రభుత్వం రావడంతో ప్రపంచవ్యాప్తంగా భారత్ కు గౌరవం పెరిగింది.
- ఈ సభలో 203 బిల్లులు ఆమోదం పొందాయి.
- మా హయాంలో బంగ్లాదేశ్ భూవివాదం పరిష్కారమైంది.
- విదేశాల్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సహాయం చేయడంలో భారత్ ముందుంది.
- శ్రీలంక, నేపాల్, మాల్దీవులకు సహాయ సహకారాలు అందించాం.
- దేశ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అవినీతిపై పోరాటం చేశాం.
- నల్లధనం, అవినీతిని అరికట్టేందుకు చట్టాలు తీసుకొచ్చాం.
- గర్భిణీలకు 26వారాల పాటు సెలవులివ్వాలని చట్టాలు తెచ్చాం. ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతిష్ఠ, గౌరవం పెరిగింది.
- అన్ని వర్గాలకు సామాజిక న్యాయం సమకూరింది. ఓబీసీలకు రిజర్వేషన్ల అమలుకు కమిషన్ వేశాం.
- గాంధీ జయంతి, అంబేద్కర్ జయంతి, యోగా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి నిర్వహించే స్థాయికి ఎదిగాం.
- విదేశాల్లోని నల్లదనాన్ని వెనక్కి తెచ్చేందుకు అత్యంత కఠినమైన చట్టాన్ని తెచ్చాం.
- బినామీ ఆస్తుల జప్తు చట్టాన్ని అమల్లోకి తెచ్చాం.
- 24 వారాల పాటు మెటర్నిటీ సెలవులను అందించడం చూసి అగ్రరాజ్యాలే ఆశ్చర్యపోతున్నాయి.
- టీడీపీ.. బీజేపీని వదలివెళ్లిపోయింది. తెదేపా వదిలేయడంతోనే మా టెన్షన్లు తగ్గిపోయాయి.
- భూకంపాలను తట్టుకుని నిలవడంతో లోక్‌సభ ఔన్నత్యం పెరిగింది.