అభినందన్ ను చూసి భారతీయులు గర్వపడుతున్నారు : పీఎం మోడీ
ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ను చూసి భారతీయులంతా గర్వపడుతున్నారని పీఎం మోడీ అన్నారు.

ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ను చూసి భారతీయులంతా గర్వపడుతున్నారని పీఎం మోడీ అన్నారు.
తమిళనాడు : ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ను చూసి భారతీయులంతా గర్వపడుతున్నారని పీఎం మోడీ అన్నారు. అభినందన్ ను ఆయన ప్రశంసించారు. ధైర్యవంతుడైన వింగ్ కమాండర్ అభినందన్ తమిళనాడు నుండి వచ్చినందుకు దేశం మొత్తం గర్విస్తుందన్నారు.
Read Also : దేశం విడిచి వెళ్లిపో.. పాక్ మహిళను ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు
మార్చి 1 శుక్రవారం కన్యాకుమారిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తమిళనాడు తీర ప్రాంత రాష్ట్రమన్నారు. ఈ సందర్భంగా మోడీ విపక్షాలను టార్గెట్ చేశారు. వారి ప్రకటనలతో పాకిస్తాన్ కు సహాయం చేస్తూ, భారత్ కు హాని కలిగించారని ఆయన ఆరోపించారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచం మద్దతిస్తుంటే.. కొన్ని పార్టీలు అనుమానిస్తున్నా యన్నారు. దేశ వ్యాప్తంగా మన సైనిక బలగాలకు మద్దతిస్తుంటే.. విపక్షాలు మాత్రం అనుమానిస్తున్నాయని చెప్పారు.
Read Also : ఫోర్ బోనస్ : 24 వేళ్లతో పుట్టిన బాబు
Read Also : అభినందన్ కోసం ఎదురుచూస్తోన్న సినీ తారలు