PM Modi : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటికి ప్రధాని మోదీ, చిరంజీవి.. ఘనంగా సంక్రాంతి వేడుకలు
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు.

PM Modi : ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి సైతం హాజరయ్యారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శ్రీనివాస వర్మ, మెగాస్టార్ చిరంజీవి.. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి.
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ శకావత్, జ్యోతి రాధిత్య సింధియా, మనోహర్ లాల్ కట్టర్, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్, సతీష్ చంద్ర దూబే ఈ సంబరాల్లో పాల్గొన్నారు.
ఇక ఎంపీలు లక్ష్మణ్, అనురాగ్ ఠాకూర్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, లక్ష్మణ్, గోడెం నగేష్, బాలశౌరి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణతో పలువురు తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి ఇంట జరుగుతున్న సంక్రాంతి వేడులకు హాజరయ్యారు.
Also Read : మహాకుంభమేళాలో మొదటి రోజు 60 లక్షల మంది భక్తుల పుణ్యస్నానాలు.. ఏరియల్ ఫుటేజీలో భారీ జనసందోహం!