Lata Mangeshkar: అయోధ్యలో ఒక కూడలికి “లతా మంగేష్కర్” పేరు: యోగికి మోదీ ప్రశంస

రాముడు నెలవైయున్న అయోధ్యానగరంలో ఒక రహదారికి ఆమె పేరు పెట్టడం సంతోషించదగ్గ విషయమని మోదీ వ్యాఖ్యానించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ప్రధాని మోదీ అభినందించారు.

Lata Mangeshkar: అయోధ్యలో ఒక కూడలికి “లతా మంగేష్కర్” పేరు: యోగికి మోదీ ప్రశంస

Ayodya

Updated On : February 11, 2022 / 8:22 PM IST

Lata Mangeshkar: తన గాత్రంతో 70 ఏళ్ల పాటు దేశ ప్రజలను అలరించి.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న భారత గాన కోకిల, దివంగత గాయని లతా మంగేష్కర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. లతా మంగేష్కర్ గౌరవార్ధం.. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఒక “కూడలికి లతా మంగేష్కర్ చౌరస్తాగా” నామకరణం చేయనున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. అయోధ్యలోని రామ మందిరానికి చేరుకోవాలంటే ప్రజలు ఈ కూడలి గుండానే దాటాల్సి ఉంటుంది. దీంతో ఈ కూడలికి లతా మంగేష్కర్ పేరు పెట్టడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

Also read: No Vaccine: వాక్సిన్ కు వ్యతిరేకంగా ఇతర దేశాల్లోనూ కెనడా తరహా “ఫ్రీడమ్ కాన్వాయ్” నిరసనలు

తన గోవా పర్యటన సందర్భంగా గురువారం ఈ విషయంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ..లతామంగేష్కర్ గోవాకు చెందిన వారని.. ఎంతో గొప్ప రామ భక్తురాలని అన్నారు. రాముడు నెలవైయున్న అయోధ్యానగరంలో ఒక రహదారికి ఆమె పేరు పెట్టడం సంతోషించదగ్గ విషయమని మోదీ వ్యాఖ్యానించారు. ఈనిర్ణయం తీసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ప్రధాని మోదీ మనస్ఫూర్తిగా అభినందించారు. “అయోధ్యకు వచ్చి, రాముడి దర్శనానికి వెళ్ళేవారెవరైనా.. లతా జీ చౌరస్తా గుండా వెళుతూ ఆమెను స్మరించుకుంటారని” మోదీ అన్నారు.

Also read: Rajasthan Police: నకిలీ వార్తల కట్టడిపై రాజస్థాన్ పోలీసుల వినూత్న ప్రచారం