మహా ప్రభుత్వానికి మోదీ,షా అభినందనలు 

  • Published By: chvmurthy ,Published On : November 23, 2019 / 04:48 AM IST
మహా ప్రభుత్వానికి మోదీ,షా అభినందనలు 

Updated On : November 23, 2019 / 4:48 AM IST

మహారాష్ట్ర సీఎం,డిప్యూటీ సీఎం గా శనివారం ఉదయం ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారు. వీరిద్దరి నాయకత్వంలో మహారాష్ట్ర మరింత అభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హెంశాఖ మంత్రి అమిత్‌ షా కూడా ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌లను అభినందించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మహారాష్ట్ర అభివృద్ధికి, మరాఠి ప్రజల సంక్షేమానికి పాటు పడుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Also Read : మహారాష్ట్ర ప్రజలు కిచిడీ ప్రభుత్వాన్ని కోరుకోలేదు : సీఎం దేవేంద్ర ఫడ్నవీస్