PM Modi: ఢిల్లీ బ్లాస్ట్ బాధితులకు ప్రధాని మోదీ పరామర్శ.. భూటాన్ నుంచి రాగానే నేరుగా..

డాక్టర్లను అడిగి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అలాగే వారికి అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

PM Modi: ఢిల్లీ బ్లాస్ట్ బాధితులకు ప్రధాని మోదీ పరామర్శ.. భూటాన్ నుంచి రాగానే నేరుగా..

Updated On : November 12, 2025 / 5:22 PM IST

PM Modi: ఢిల్లీలో భారీ పేలుడు యావత్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. సోమవారం సాయత్రం ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో 12 మంది చనిపోయారు. 16 మంది గాయపడ్డారు. వారంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఢిల్లీ పేలుడు ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (ఎల్ఎన్‍జేపీ) ఆసుపత్రికి వెళ్లారు. పేలుడు ఘటనలో తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. బాధితులతో స్వయంగా మాట్లాడారు.

డాక్టర్లను అడిగి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అలాగే వారికి అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని చెప్పారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కాగా, ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. కుట్రదారులను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

”బరువెక్కిన హృదయంతో ఇక్కడికి వచ్చా. ఈ దుఃఖ సమయంలో దేశం మొత్తం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తోంది. పేలుడు ఘటనపై కేంద్ర భద్రతా సంస్థలు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాయి. ఈ దాడికి కారణమైన వారిని వదిలేది లేదు. వారిని తప్పకుండా న్యాయస్థానం ముందు నిలబెడతాం” అని ప్రధాని మోదీ అన్నారు.

Also Read: ఢిల్లీ బాంబు పేలుడు ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు.. పెద్ద ప్లానే బయటపడింది..