కాంగ్రెస్ తప్పుడు సిద్ధాంతాలతో నాశనం చేసింది: చివరి రోజు ప్రచారంలో మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై కామెంట్లు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో తప్పుడు సిద్ధాంతాలు ప్రచారం చేసి దేశాన్ని, జాతీయతను పాడు చేశారని ఆరోపించారు. ప్రచారంలో ఆఖరిరోజు కావడంతో కశ్మీర్ లో ఆర్టికల్ 370రద్దును ఇది తాత్కాలిక మార్పు అని, 70ఏళ్లుగా కాంగ్రెస్ దీని గురించి అస్సలేం చేయలేదని వ్యాఖ్యానించారు.
‘మీరు నన్ను ఐదేళ్ల పాటు ఉంచాలనుకుంటే ఈ మార్పును తాత్కాలికం కాదు. శాశ్వతం చేస్తా’ అని మోడీ తెలిపారు. కశ్మీర్ లోయ ప్రాంతంలో నివాసముండే 4లక్షల కశ్మీరీ పండిట్‌లను ఖాళీ చేయించారని కాంగ్రెస్ పై మండిపడ్డారు భారత ప్రధాని మోడీ. పనిలో పనిగా కర్తాపూర్ కారిడార్ విషయాన్ని ప్రస్తావించారు. 70ఏళ్లుగా కర్తాపూర్ సాహెబ్ గురుద్వారా దర్శనాన్ని భక్తులు బైనాక్యూలర్లతో వీక్షిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర, హర్యానాలలో ఎన్నికలు జరగనుండగా శనివారం ఆఖరి రోజు ప్రచారాన్ని పూర్తి చేసుకున్నాయి రాజకీయ పార్టీలు. 17రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2పార్లమెంట్ స్థానాలకు ప్రచారం ముగిసింది. అక్టోబరు 21న ఎన్నికలు జరుగుతుండగా అక్టోబరు 24న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.