PM-Sharad Pawar : ప్రధాని మోదీతో గంటపాటు శరద్ పవార్ భేటీ.. ఏం చర్చించి ఉండొచ్చు!

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్, రాజ్యసభ ఎంపీ శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దాదాపు గంటపాటు మోదీ, పవార్ ల సమావేశం కొనసాగింది. ఈ భేటీకి సంబంధించి ఫొటోను ప్రధాని కార్యాలయం అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది.

PM-Sharad Pawar : ప్రధాని మోదీతో గంటపాటు శరద్ పవార్ భేటీ.. ఏం చర్చించి ఉండొచ్చు!

Pm Modi, Sharad Pawar Meet For Nearly 50 Minutes

Updated On : July 17, 2021 / 1:13 PM IST

PM-Sharad Pawar Meet : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్, రాజ్యసభ ఎంపీ శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దాదాపు గంటపాటు మోదీ, పవార్ ల సమావేశం కొనసాగింది. ఈ భేటీకి సంబంధించి ఫొటోను ప్రధాని కార్యాలయం అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది. మహారాష్ట్ర నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాను పోటీలో లేనని స్పష్టం చేశారు.

గత నెలలో ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని మోదీని కలిసిన తర్వాత శరద్ పవార్ మోదీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే శరద్ పవార్ తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండుసార్లు భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పవార్ ను నిలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఊహాగానాలు వినిపించాయి. ఈ ప్రచారాన్ని శరద్ పవార్ ఖండించారు.

ప్రశాంత్ కిశోర్ తనతో రెండుసార్లు భేటీ అయ్యారని, తమ మధ్య రాష్ట్రపతి ఎన్నికలు లేదా 2024 సార్వత్రిక ఎన్నికల అంశమే చర్చకు రాలేదని పవార్ స్పష్టం చేశారు. ఎన్నికల వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు ప్రశాంత్ కిశోర్ చెప్పారని తెలిపారు. ఇరువురి భేటీలో ఎటువంటి రాజకీయ అంశాలూ ప్రస్తావనకు రాలేదని పవార్ తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనను అభ్యర్ధిగా పేర్కొవడం చాలా తప్పుని, తాను రాష్ట్రపతి అభ్యర్థిని కాదని అన్నారు. 2024 ఎన్నికల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.