ఉగ్రదాడి : అమరులైన జవాన్లకు ఘన నివాళి

జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవాన్ల మృతదేహాలకు ప్రధాని నరేంద్రమోడీ నివాళులు అర్పించారు.

  • Published By: veegamteam ,Published On : February 15, 2019 / 03:50 PM IST
ఉగ్రదాడి : అమరులైన జవాన్లకు ఘన నివాళి

జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవాన్ల మృతదేహాలకు ప్రధాని నరేంద్రమోడీ నివాళులు అర్పించారు.

ఢిల్లీ : జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవాన్ల మృతదేహాలకు ప్రధాని నరేంద్రమోడీ నివాళులు అర్పించారు. ఢిల్లీ పాలెం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరిన సైనికుల పార్దివదేహాలకు త్రివిధ దళాల అధిపతులు కూడా గౌరవ వందనం చేశారు. రక్షణ శాఖా మంత్రి నిర్మలాసీతారామన్, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నివాళులు అమరవీరులకు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. సైనిక లాంఛనాలతో అమరవీరుల పార్థివదేహాలు  స్వస్థలాలకు తరలనున్నాయి.