PM Modi : సొరంగం నుంచి బయటపడ్డ కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ.. మీ ధైర్యం, సాహసం గొప్పవి అంటూ ప్రశంసలు

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్క్యరా టన్నల్ లో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటరావటంతో పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు.సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులతో ప్రధాని మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

PM Modi : సొరంగం నుంచి బయటపడ్డ కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ.. మీ ధైర్యం, సాహసం గొప్పవి అంటూ ప్రశంసలు

Modi telephon conversation Silkyara tunnel rescued Workers

PM Modi telephon conversation tunnel rescued Workers : ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్క్యరా టన్నల్ లో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటకొచ్చిన విషయం తెలిసిందే. 17 రోజులుగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. దీంతో అందరు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రధాని మోదీ సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులతో మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులంతా క్షేమంగా బయటకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రధాని సొరంగంలో వారు ధైర్యంతో ఉండటాన్ని ప్రశంసించారు. 17 రోజులు అంటే తక్కువ సమయం కాదు..శ్రామికులు చూపిన ధైర్యం సాహసోపేతమైంది అని పొగిడారు.

అధికారుల ప్రయత్నాలు కుటుంబ సభ్యుల ప్రార్ధనలతో క్షేమంగా బయటకు వచ్చారని అన్నారు.ప్రతిరోజు ఉత్తరాఖండ్ సీఎం, పీఎంఓ అధికారులతో సమాచారం తాను తెలుసుకున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.టన్నల్ లో ఐక్యంగా దైర్యంగా కార్మికులంతా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారని అన్నారు.ఈ సందర్భంగా కార్మికులు ప్రధానితో మాట్లాడుతు..తామంతా వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్లం.. అయినా అన్నదమ్ముల్లా మెలిగామని తెలిపారు.ప్రతిరోజు ఉదయం మార్నింగ్ వాక్ యోగా చేసేవాళ్ళమని..ఉత్తరాఖండ్ ప్రభుత్వం అందించిన సహకారం మరువలేనిదని అన్నారు.ప్రతిరోజు ఆహారం కావలసిన సదుపాయలన్నీ అధికారయంత్రంగా తమకు కల్పించిందని ప్రధానికి తెలిపారు నవాయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ కార్మికులు.

Uttarkashi Tunnel Operation : సమిష్టి కృషికి అద్భుతమైన ఉదాహరణ- టన్నెల్ ఆపరేషన్ సక్సెస్‌పై ప్రధాని మోదీ హర్షం

కాగా ఉత్తరకాశి సిల్క్యరా సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావటంతో వారి కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరిసాయి. కార్మికుల గ్రామాల్లో మరోసారి దీపావళి పండుగ వాతావరణం నెలకొంది. సొరంగంలో చిక్కుకుని 17 రోజుల పాటు నరక యాతన అనుభవించి ప్రాణాలతో తమకు దక్కిన సంతోషాన్ని బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.