PM Modi Uttarakhand Tour : నేడు ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోదీ పర్యటన..ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారు. ఆ రాష్ట్రంలో నిర్మించిన ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.

PM Modi Uttarakhand Tour : నేడు ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోదీ పర్యటన..ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన

Modi

Updated On : December 4, 2021 / 8:26 AM IST

Delhi-Dehradun corridor project : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారు. ఆ రాష్ట్రంలో నిర్మించిన ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే దాదాపు 18వేల కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. అనంతరం డెహ్రాడూన్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు.

ఢిల్లీ- డెహ్రాడూన్‌ ఎకనామిక్‌ కారిడార్‌తో ఢిల్లీ నుంచి డెహ్రడూన్‌కు ప్రయాణ సమయం సగానికి తగ్గనుంది. మూడు గంటల్లోనే ప్రయాణం పూర్తవుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ ఎకనామిక్‌ కారిడార్‌ ప్రాజెక్టును 8వేల 300 కోట్ల వ్యయంతో చేపట్టారు.ఈ కారిడార్‌ను జంతుసంరక్షణ కోసం చర్యలు తీసుకుంటూ నిర్మించారు. అక్కడక్కడ జంతుసంరక్షణ కోసం అండర్‌ పాస్‌లు సైతం నిర్మించారు. జంతువుల కోసం ఆసియాలో అతి పొడవైన ఎలివేటెడ్ వన్యప్రాణి కారిడార్ కూడా ఈ ప్రాజెక్టు పరిధిలోకే రానుంది.

Kangana Ranaut : పంజాబ్‌ పర్యటనకు వెళ్లిన కంగనా రనౌత్‌ను అడ్డుకున్న రైతులు

17వందల కోట్ల వ్యయంతో యమునా నదిపై నిర్మించిన 120 మెగావాట్ల వైసీ జలవిద్యుత్ ప్రాజెక్ట్, అలాగే హిమాలయన్ కల్చర్ సెంటర్‌లో రాష్ట్ర స్థాయి మ్యూజియం, 8వందల సీట్ల ఆర్ట్ ఆడిటోరియం, లైబ్రరీ, సాంస్కృతిక సమావేశ కేంద్రాన్ని కూడా మోదీ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా, డెహ్రాడూన్‌లో సెంటర్ ఫర్ అరోమాటిక్ ప్లాంట్స్‌ను ప్రధాని ప్రజలకు అంకితం చేస్తారు.