PM MODI : ప్రపంచంలోనే అతిపెద్ద మిలటరీ శక్తిగా భారత్..ఏడు కొత్త ఢిఫెన్స్ కంపెనీలను ప్రారంభించిన మోదీ
స్వాతంత్య్రం అనంతరం మొదటిసారి రక్షణ రంగంలో భారీ సంస్కరణలను తమ ప్రభుత్వం చేపట్టిందని, దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా నేడు రక్షణ రంగంలో పారదర్శకత, విశ్వాసం పెంపొందాయని ప్రధానమంత్రి

Modi (4)
PM MODI స్వాతంత్య్రం అనంతరం మొదటిసారి రక్షణ రంగంలో భారీ సంస్కరణలను తమ ప్రభుత్వం చేపట్టిందని, దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా నేడు రక్షణ రంగంలో పారదర్శకత, విశ్వాసం పెంపొందాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.
విజయదశమి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఏడు కొత్త ప్రభుత్వ రక్షణ సంస్థలను(మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్,ఆర్మర్డ్ వాహనాల కార్పొరేషన్ లిమిటెడ్, అధునాతన ఆయుధాలు మరియు సామగ్రి ఇండియా లిమిటెడ్, ట్రూప్ కంఫోర్ట్స్ లిమిటెడ్,యంత్ర ఇండియా లిమిటెడ్, ఇండియా ఆప్టెల్ లిమిటెడ్, గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్)ప్రారంభించారు.
రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని మోదీ.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్(OFB) స్థానంలో ఏర్పాటు చేసిన 7 ఆయుధ కర్మాగారాలను జాతికి అంకితం ఇచ్చారు. కొత్త భవిష్యత్తును నిర్మించడానికి భారతదేశం కొత్త తీర్మానాలను తీసుకుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్య్రం తర్వాత రక్షణ రంగాన్ని ఆధునికీకరించాల్సిన అవసరం ఉన్నా ఎవరూ శ్రద్ధ చూపలేదని.. తమ ప్రభుత్వం అది చేసి చూపించిందన్నారు. రక్షణ రంగంలో అనేక ప్రధాన సంస్కరణలు జరిగాయని, స్తబ్దత విధానాలకు బదులుగా ‘సింగిల్ విండో సిస్టమ్’ ఏర్పాటు చేయబడిందని ప్రధాని మోదీ చెప్పారు. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు.
గత ఏడేళ్లుగా దేశాన్ని స్వావలంబన దిశగా నడిపిస్తున్నామని మోదీ అన్నారు. గత ఏడు సంవత్సరాలలో ‘మేక్ ఇన్ ఇండియా’ అనే మంత్రంతో ఆధునిక సైనిక పరిశ్రమను నిర్మించడానికి భారతదేశం కృషి చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రక్షణ పరికరాల ఉత్పత్తిలో భారత్ స్వయంసమృద్ధి సాధించడానికి సింగిల్ విండో విధానాలను తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా.. దేశాన్ని సొంతంగా ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక శక్తిగా తీర్చిదిద్దడం మరియు ఆధునిక సైనిక పరిశ్రమను నిర్మించడమే తమ లక్ష్యమని మోదీ అన్నారు. స్వయం సమృద్ధిని సాధించడం కోసం 41 ఆయుధ కార్మాగారాలను ఏడు పరిశ్రమలుగా మార్చినట్లు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్..రక్షణ సంసిద్ధతలో స్వయంసమృద్ధిని మెరుగుపరుచుకునే చర్యలో భాగంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌ను ఒక శాఖ నుండి ఏడు పూర్తి ప్రభుత్వ యాజమాన్య సంస్థలుగా మార్చడం బలమైన క్రియాత్మక స్వయంప్రతిపత్తి దిశగా దారితీస్తుందని కొత్త ఆవిష్కరణలకు దిశగా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు.
కాగా, 200 ఏళ్ల క్రితం బ్రిటీష్ వారి కాలంలో రక్షణ ఆయుధాల ఉత్పత్తికి ఏర్పాటు చేసిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్( OFB) ను ఏడు పరిశ్రమలుగా కేంద్రం మార్చిన విషయం తెలిసిందే. ఆయుధాలు, సైనిక సంబంధ పరికరాల ఉత్పత్తి కోసం OFB ఆధ్వర్యంలో ఉన్న 41 ఫ్యాక్టరీలను.. ప్రభుత్వ ఆధీనంలోని 7 కార్పొరేట్ కంపెనీలుగా విభజించే దీర్ఘకాల ప్రతిపాదనకు ఈ ఏడాది జూన్ లో కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జవాబుదారీతనం, సమర్థత, పోటీతత్వాలను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. కార్పొరేటీకరణ నిర్ణయంతో ఓఎఫ్ బీ స్వయంప్రతిపత్తి మరింత మెరుగుపడి, ఆయుధాల సరఫరాలో జవాబుదారీతనం, సామర్థ్యం పెరుగుతుందని ఓ అధికారి తెలిపారు.
ALSO READ బాలయ్యకు రోజా ఫోన్ కాల్.. ‘జబర్దస్త్’కి వస్తానని చెప్పిన నటసింహం..