ఏరియల్ సర్వే: సీఎంతో కలిసి పర్యటించిన ప్రధాని మోడీ

  • Published By: vamsi ,Published On : May 6, 2019 / 05:24 AM IST
ఏరియల్ సర్వే: సీఎంతో కలిసి పర్యటించిన ప్రధాని మోడీ

Updated On : May 6, 2019 / 5:24 AM IST

ఫోని తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించేందుకు ప్రధాని మోడీ ఒడిశా చేరుకున్నారు. భువనేశ్వర్ విమానాశ్రయంలో మోడీకి ఒడిశా గవర్నర్ గణేషీలాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతం పలికారు.అనంతరం తుపాను సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన ఒడిశాలో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం నవీన్ పట్నాయక్‌తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే కేంద్రం ఒడిశాకు రూ.1000కోట్ల సాయం ప్రకటించింది. ఫొని తుపాను ఎఫెక్ట్‌తో ఒడిశాలో చనిపోయిన వారి సంఖ్య 33కు చేరుకోగా తుపాను తర్వాత పరిస్థితులను చక్కబెట్టేందుకు అక్కడి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇంకా కొన్నిచోట్ల విద్యుత్‌ లేదు. భువనేశ్వర్‌, పర్యాటక క్షేత్రం పూరీ రైల్వే స్టేషన్లు తీవ్ర గాలుల ధాటికి పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా 5 వేల గ్రామాలు, 50 పట్టణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వేల చెట్లు, కరెంటు స్తంభాలు, సెల్ ఫోన్ టవర్లు నేలకూలాయి. రైలు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.