PM Modi : మధ్యంతర బడ్జెట్ పై ప్రధాని మోదీ.. పేదలు, మధ్య తరగతికి మేలు చేసే బడ్జెట్
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

PM Narendra Modi on Interim budget 2024
PM Modi on interim budget 2024 : ఎన్నికల సంవత్సరం కావడంతో ఏమైన వరాల జల్లు కురుస్తుందా అని సాధారణ, మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తుండగా కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పేదలకు, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసే బడ్జెట్ ఇది అని అన్నారు.
దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్డెట్ ఎంతో విశ్వాసాన్ని ఇచ్చిందన్నారు. పేదలు, మహిళలు, రైతులు, యువత సాధికారతకు ఎంతో కృషి చేస్తుందన్నారు. 2047 నాటికి భారత దేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ ఓ గ్యారెంటీని ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్ యువ భారత్ ఆకాంక్షలకు ప్రతిబింబమన్నారు. మౌళిక వసతుల కోసం రూ.11వేల కోట్లు, సాంకేతిక రంగంలో పరిశోధన, సృజనాత్మకత కోసం రూ.లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.
Union Budget 2024-25 : కేంద్ర మధ్యంతర బడ్జెట్‌లో శాఖలవారిగా కేటాయింపులు ఇవే..
ఇక పీఎం ఆవాస్ యోజన కింద దేశంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో రెండు కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. సామాన్య పౌరులపై భారం పడకుండా జీవనశైలిని మరింత సులభతరం చేయడం ఈ బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. ఈ బడ్జెట్‌ను చారిత్రక బడ్జెట్ గా మోడీ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. మధ్యంతర బడ్జెట్‌లో ఆదాయ పన్ను సాబుల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే.. కొత్త పన్ను విధానం తెస్తామని ప్రకటించింది కేంద్రం.