బాలుడు అంటూ.. రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు

99 మార్కులు వచ్చాయని ఓ బాలుడు ఆనందపడుతున్నాడు. కానీ 100కు కాదు 543కు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పంచ్‌లు విసిరారు.

బాలుడు అంటూ.. రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు

Narendra Modi on Rahul Gandhi: లోక్‌స‌భ‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీపై ఉన్న పలు కేసుల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ఓబీసీలను అవమానించిందుకు శిక్ష ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం లోక్‌స‌భ‌లో ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పిల్లాడి మనస్తత్వం సభలో బయటపడిందని అన్నారు.

ఈవీఎంలు, రాజ్యాంగం గురించి అబద్దాలు చెప్పారని.. అగ్నివీర్ పథకం గురించి కూడా నిన్న సభలో అసత్యాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీని బాలుడు అంటూ పదేపదే సంబోధించారు. 99 మార్కులు వచ్చాయని ఓ బాలుడు ఆనందపడుతున్నాడు. కానీ 100కు కాదు 543కు అంటూ పంచ్‌లు విసిరారు.

Also Read: లోక్‌స‌భ‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం.. ఆంధ్రప్రదేశ్‌లో క్లీన్‌స్వీప్‌ చేశామని ప్రకటన

2024 ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ మిత్రపక్షాలు విశ్లేషించుకోవాలి. ఈ ఎన్నికల ద్వారా మిత్రపక్షాల పాలిట పరాన్నజీవిగా కాంగ్రెస్ మారింది. ఆ పార్టీకి 13 రాష్ట్రాల్లో సున్నా సీట్లు వచ్చాయి. రాజ్యాంగం, రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అబద్దాలు చెబుతూనే ఉంది. ప్రజలు వాస్తవాలు గ్రహించాలి. దళితులు, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది. జగ్జీవన్ రావ్ ప్రధానమంత్రి కాకుండా ఇందిరా గాంధీ అడ్డుపడ్డారు. హిందువులంటే హింసను ప్రేరేపించేవారు కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.