High Tension in Delhi : పంజాబ్ – హర్యానా బార్డ‌ర్‌లో ఉద్రిక్తత… రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

పంజాబ్, హర్యానా బార్డర్ ఉద్రిక్తంగా మారింది. శంభు సరిహద్దుల్లో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

High Tension in Delhi : పంజాబ్ – హర్యానా బార్డ‌ర్‌లో ఉద్రిక్తత… రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

Delhi Chalo

Updated On : February 13, 2024 / 3:35 PM IST

Delhi Chalo : ఢిల్లీ సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రైతులు ట్రాక్టర్లతో సరిహద్దులవైపు వస్తున్నారు. ఇటు పోలీసులు భారీగా మోహరించారు. రైతులు గుంపులు గుంపులుగా వస్తున్న మార్గాల్లో పోలీసు బలగాలు టియర్ గ్యాస్ వదులుతున్నాయి. అన్నదాతలను సరిహద్దు దాటనిచ్చేదే లేదంటూ పోలీసులు అడ్డుగు నిలబడ్డారు. రైతులు ఢిల్లీలో అడుగు పెట్టకుండా ఎక్కడికక్కడ బారికేడ్లను అడ్డుగా పెట్టారు. ట్రాక్టర్లు ముందుకు కదలకుండా దిమ్మెలను, ఇనుప కంచెలను ఉంచారు. ఇండియా గేట్, పార్లమెంట్ కు వెళ్లే మార్గాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.

ఢిల్లీలోని ఎర్రకోటకు సందర్శకులను నిలిపివేశారు. రైతుల నిరసన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు. ఢిల్లీలో ఏ రోడ్డు, ఏ సరిహద్దు చూసినా పోలీసుల గస్తీతో కనిపిస్తోంది. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉండే తరహాలో భద్రతా బలగాలు నిలబడి ఉన్నాయి. దీన్నేమీ పట్టించుకోని రైతులు ఢిల్లీ వైపు దూసుకెళ్తున్నారు. దీంతో సమయం గడుస్తున్నాకొద్దీ ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. మరోవైపు పంజాబ్ – హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Also Read : హస్తినలో అన్నదాతల ఆందోళన.. రైతుల ప్రధాన డిమాండ్లు ఇవే..

పంజాబ్, హర్యానా బార్డర్ ఉద్రిక్తంగా మారింది. శంభు సరిహద్దుల్లో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో రైతులు పరుగులు తీశారు. రైతులపై పోలీసులు లాఠీలు ఝుళిపించి వారిని చెల్లాచెదురు చేశారు. పంజాబ్ – హర్యానా బార్డర్ ప్రాంతానికి రైతులు భారీ సంఖ్యలో చేరుకోవటంతో ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. హర్యానా సరిహద్దు ప్రాంతంలో 11 కంపెనీల బలగాలను మోహరించారు. అంబాల హైవేపైకి భారీగా రైతులు చేరుకుంటున్నారు. కాగా, పంజాబ్ హరియాణా సరిహద్దు శంబు వద్ద రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీకి 216 కిలోమీటర్ల దూరంలో రైతులను నిలువరించారు.