నాన్న.. నన్ను వదిలి వెళ్లకు : డ్యూటీకి జల్దీగా వెళ్లాలి బేటా

పోలీసు ఉద్యోగం ఎంత కఠినమైనదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సమయంతో సంబంధం లేకుండా ఎక్కువ గంటలు డ్యూటీ చేయాల్సి ఉంటుంది.

  • Published By: sreehari ,Published On : April 29, 2019 / 09:17 AM IST
నాన్న.. నన్ను వదిలి వెళ్లకు : డ్యూటీకి జల్దీగా వెళ్లాలి బేటా

Updated On : April 29, 2019 / 9:17 AM IST

పోలీసు ఉద్యోగం ఎంత కఠినమైనదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సమయంతో సంబంధం లేకుండా ఎక్కువ గంటలు డ్యూటీ చేయాల్సి ఉంటుంది.

పోలీసు ఉద్యోగం ఎంత కఠినమైనదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సమయంతో సంబంధం లేకుండా ఎక్కువ గంటలు డ్యూటీ చేయాల్సి ఉంటుంది. పోలీసు అధికారులు చాలామంది తమ విధినిర్వహణలో మునిగిపోయి.. ఇంటికి ఎప్పుడు తిరిగి వచ్చేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. భార్యా పిల్లలకు దూరంగా ఎక్కడికో వెళ్లి డ్యూటీ చేయాల్సి ఉంటుంది. డ్యూటీకి వెళ్లినప్పటి నుంచి ఇంట్లో వారంతా వారి కోసం ఎదురుచూస్తుండిపోతుంటారు.

ఇక పిల్లలు అయితే నాన్న ఎప్పుడు వస్తాడా? అని తలుపు వైపు అలానే చూస్తుండిపోతారు. కుటుంబం కంటే విధి నిర్వహణే ఎంతో ముఖ్యమని చాటిచెప్పేలా ఓ పోలీసు అధికారి పోస్టు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐజీపీ అరుణ్ బోత్రా అనే హై ర్యాంకింగ్ పోలీసు అధికారి.. తన ట్విట్టర్ అకౌంట్ లో అందరి హృదయాలను కదిలించే వీడియోను పోస్టు చేశారు. డ్యూటీకి వెళ్లే సమయంలో తన కుమారుడు తనను వెళ్లకుండా అడ్డుకున్నప్పటికీ విధి నిర్వహణే ముఖ్యమంటూ ముందుకు సాగారు.

ఈ వీడియోలో.. ఆ పిల్లాడు.. డ్యూటీకి వెళ్లొద్దు డాడీ.. ఇంటి దగ్గరే ఉండూ అంటూ తండ్రి కాళ్లు పట్టుకుని ఏడ్చేసాడు. డ్యూటీకీ జల్దీగా వెళ్లాలి బేటా.. ఇంట్లో ఉండు.. అని ఎంతగా నచ్చజెప్పినా.. బుడ్డోడు వదల్దేదు. ఇంట్లో ఉండాల్సిందేనంటూ గట్టిగా పట్టుబడ్డాడు. ఏడుస్తున్న పిల్లాడికి సర్దిచెప్పలేక తనలోనే తాను మదనపడ్డాడు. తండ్రిగా ఒకవైపు కుమారుడిని చూసి కన్నీళ్లు వస్తున్నా.. దిగమింగుతూ.. బరువెక్కిన మనస్సుతో విధినిర్వహణే ముఖ్యమంటూ డ్యూటీకి పయనమయ్యాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పోలీసు అధికారికి డ్యూటీ పట్ల ఉన్న సమయస్ఫూర్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.