అజ్ఞాతవ్యక్తుల నుంచి రాజకీయ పార్టీలకు రూ.11,234 కోట్ల విరాళాలు, బీజేపీ వాటా ఎంత?

  • Published By: chvmurthy ,Published On : March 10, 2020 / 04:41 AM IST
అజ్ఞాతవ్యక్తుల నుంచి రాజకీయ పార్టీలకు రూ.11,234 కోట్ల విరాళాలు, బీజేపీ వాటా ఎంత?

Updated On : March 10, 2020 / 4:41 AM IST

దేశంలోని జాతీయ  రాజకీయ పార్టీలు 2004-19 మధ్య కాలంలో పలువురు అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి రూ 11,234 కోట్ల విరాళాలను  సేకరించాయని ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) తన నివేదికలో వెల్లడించింది. ఏడు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలను  పరిశీలించిన తర్వాత ఏడీఏ ఈ నివేదికను రూపొందించింది. 

రూ 20,000 కంటే తక్కువ విలువైన విరాళాలను పార్టీలు అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చిన నిధులుగా ఆయా పార్టీలు ఐటీ రిటన్స్‌లో పేర్కొంటాయి. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా విరాళాలు, కూపన్ల అమ్మకాలు, రిలీఫ్‌ ఫండ్‌, ఇతర ఆదాయం, స్వచ్ఛంద విరాళాలు, సమావేశాలు, మోర్చాల్లో వసూలైన మొత్తాలు వంటి రాబడిని అజ్ఞాత మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణిస్తారు.

2004-19 వరకూ ఉన్న 15 ఏళ్ళలో జాతీయ రాజకీయ పార్టీలు రూ 11,234 కోట్లు ఈ మార్గాల ద్వారా సమీకరించినట్టు ఏడీఆర్‌ వెల్లడించింది. ఇక 2018-19లో రూ 1612 కోట్లు ఈ మార్గం ద్వారా వచ్చినట్టు భారతీయ జనతాపార్టీ వెల్లడించింది. ఆ ఏడాది రాజకీయ పార్టీలకు వచ్చిన అజ్ఞాత నిధుల్లో (రూ 2512 కోట్లు) ఇవి 64 శాతం కావడం గమనార్హం. ఇక కాంగ్రెస్‌ పార్టీ రూ 728.88 కోట్లు అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి నిధులు వచ్చాయని పేర్కొంది. ఇక 2004-05 నుంచి 2018-19 వరకూ కాంగ్రెస్‌, ఎన్సీపీలు కూపన్ల అమ్మకం ద్వారా ఉమ్మడిగా ఆర్జించిన మొత్తం రూ 3902.63 కోట్లని ADR పేర్కొంది.

See More :

* ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు…. టీడీపీ, సీపీఐ మధ్య కుదిరిన పొత్తు

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు : ఒక స్థానానికి అభ్యర్థి ఖరారు… మరొక స్థానంపై ఉత్కంఠ