కశ్మీర్ లో మందకొడిగా…అస్సాంలో రికార్డ్ పోలింగ్

సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) 13 రాష్ట్రాలు,2కేంద్రపాలిత ప్రాంతాల్లో 117 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 9గంటల వరకు అస్సాంలో రికార్డు స్థాయిలో 12.36శాతం పోలింగ్ నమోదు అయింది.బీహార్ లో 12.60శాతం,గోవాలో 2.29శాతం,గుజరాత్ లో 1.35శాతం,జమ్మూకశ్మీర్ లో 0.00శాతం,కర్ణాటకలో 1.75శాతం,కేరళలో 2.48శాతం,మహారాష్ట్రలో 0.99శాతం,ఒడిషాలో 1.32శాతం,త్రిపురలో 1.56శాతం,యూపీలో 10.24శాతం,వెస్ట్ బెంగాల్ లో 10.97శాతం,చత్తీస్ ఘడ్ లో 2.24శాతం,దాద్రా అండ్ నాగర్ హవేలిలో 0.00శాతం,డామన్ అండ్ డయ్యూలో 5.83శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఈసీ తెలిపింది.
#UPDATE #LokSabhaElections2019 Polling percentage recorded in Uttar Pradesh till 9 am is 10.24% https://t.co/gnNqzjXjER
— ANI (@ANI) April 23, 2019