Ajit Pawar: బాహుబలిగా శరద్ పవార్.. కట్టప్పగా అజిత్ పవార్.. పోస్టర్లు మామూలుగా లేవు..
ఎన్సీపీ తనదేనని అజిత్ పవార్ అంటున్న వేళ ఆ పార్టీ స్టూటెండ్ వింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Ajit as backstabber Kattappa
Ajit Pawar – Maharashtra: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్(Sharad Pawar)ను ఆయన సోదరుడి కుమారుడు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచారంటూ పోస్టర్లు వెలిశాయి. శరద్ పవార్ ను బాహుబలిగా, అజిత్ పవార్ ను కట్టప్పగా ఈ పోస్టర్లలో చూపారు.
ఎన్సీపీలోని శరద్ పవార్ వర్గానికి చెందినవారే ఈ పోస్టర్లు ఏర్పాటు చేయించారు. ఎన్సీపీ స్టూడెంట్ వింగ్ ఢిల్లీలోని ఎన్సీపీ కార్యాలయం వద్ద ఈ పోస్టర్లు అంటించింది. శరద్ పవార్ పై అజిత్ పవార్ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని అధికార బీజేపీ-శివసేన షిండే వర్గంతో అజిత్ పవార్ కలిశారు.
ఈ నేపథ్యంలోనే బాహుబలి-కట్టప్ప ఈ పోస్టర్లు కనపడుతున్నాయి. ఎన్సీపీ తనదేనని అజిత్ పవార్ అంటున్న వేళ ఆ పార్టీ స్టూటెండ్ వింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఇప్పటికే అజిత్ పవార్ ను బీజేపీ-శివసేన షిండే ప్రభుత్వం డిప్యూటీ సీఎంగా నియమించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు జరిగిన సమయంలోనే అజిత్ పవార్ తిరుగుబాటు చేయడం గమనార్హం. అజిత్ పవార్ తీరుపై శరద్ పవార్ వర్గ నేతలు, కార్యకర్తలు ఆందోళనలకు దిగుతున్నారు.
#WATCH | Old posters and hoardings of NCP that showed Ajit Pawar and Praful Patel on them are being removed from outside the office of the party in Delhi. A new poster with ‘Gaddaar’ (traitor) written on it is being put up there. pic.twitter.com/CjLoQmI5u9
— ANI (@ANI) July 6, 2023