Pragyan rover Video: చంద్రుడిపై శివశక్తి చుట్టూ ఇస్రో వాహనం ప్రదక్షిణలు.. వీడియో

ల్యాండర్ దిగిన పాయింట్‌ను శివశక్తిగా పిలుద్దామని ప్రధాని మోదీ చేసిన సూచన మేరకు ఇస్రో అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అలాగే,

Pragyan rover Video: చంద్రుడిపై శివశక్తి చుట్టూ ఇస్రో వాహనం ప్రదక్షిణలు.. వీడియో

Pragyan rover Video

Updated On : August 26, 2023 / 6:05 PM IST

Chandrayaan 3 – ISRO scientist: జాబిల్లిపై ప్రజ్ఞాన్ రోవర్ చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇస్రో తాజాగా ఓ ట్వీట్ చేసింది. ” శివశక్తి పాయింట్ (Shiv Shakti Point) చుట్టూ ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతోంది. జాబిల్లి దక్షిణ ధ్రువంలోని రహస్యాలను అన్వేషిస్తోంది ” అని పేర్కొంది.

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సఫలం కావడంతో చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా భారత్ అవతరించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ నిలిచింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది. ఆ ప్రాంతానికి ఇస్రో శివశక్తి అని పేరు పెట్టింది.

ల్యాండర్ దిగిన పాయింట్‌ను శివశక్తిగా పిలుద్దామని ప్రధాని మోదీ చేసిన సూచన మేరకు ఇస్రో అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అలాగే, చంద్రయాన్-2 క్రాష్ ల్యాండ్ అయిన ప్రాంతానికి తిరంగా పేరు పెడదామని మోదీ అన్నారు. చంద్రుడిపై తిరుగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ అక్కడ మన ముద్రను వేస్తూ పరిశోధనలు చేస్తోంది. అది పంపుతున్న ఫొటోలను ఇస్రో పోస్ట్ చేస్తోంది.

Lunar Land : చంద్రునిపై స్థలాలు అమ్ముతున్నారు తెలుసా? చంద్ర మండలంపై స్థలం ఎవరిది?