గోవా సీఎంగా ప్రమోద్ సావంత్!

  • Published By: venkaiahnaidu ,Published On : March 18, 2019 / 02:23 PM IST
గోవా సీఎంగా ప్రమోద్ సావంత్!

గోవా సీఎంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ ఇవాళ(మార్చి-18,2019) రాత్రి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.MGP పార్టీకి చెందిన సుదిన్ ధవలికర్,GFP పార్టీకి చెందిన విజయ్ సర్దేశాయ్ లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గోవా సీఎంగా ఉన్న మనోహర్ పారికర్ క్యాన్సర్ వ్యాధితో ఆదివారం(మార్చి-17,2018) తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.
Read Also : టీడీపీకి SPY రెడ్డి గుడ్ బై : బరిలోకి దిగి.. సత్తా చూపిస్తామంటూ సవాల్

వృత్తి రీత్యా ఆయుర్వేద డాక్టర్ అయిన సావంత్ ప్రస్తుతం సంక్యులిమ్ నియోజకవర్గానికి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గోవా రాజధాని పనాజీలోని ఓ హోటల్ సమావేశమైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు,కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ,ప్రమోద్ సావంత్,తదితర సీనియర్ నాయకులు ప్రమోద్ సావంత్ ను సీఎంగా ఎంపిక చేసినట్లు సమాచారం.

అయితే రాష్ట్రంలో పెద్ద పార్టీగా ఉన్న తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ సోమవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీ గోవా గవర్నర్‌ మృదులా సిన్హాను కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భాజపాకు 12 మంది ఎమ్మెల్యేలు ఉండగా మిత్రపక్షాలతో కలిపి ఆ సంఖ్య 20గా ఉంది. 14మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ అతిపెద్దపార్టీగా కొనసాగుతోంది. 
Read Also : అరుదైన వ్యాధి అంట : ముషార్రఫ్ ఆరోగ్యం విషమం