Prashant Kishor-Mamata Banerjee: ప్రశాంత్ కిశోర్‌తో మమతా మూడు గంటల పాటు భేటీ
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో మరోసారి వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ మరోసారి భేటీ అయ్యారు. కోల్‌కతాలో జరిగిన ఈ మీటింగ్ లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకలాపాలపై పెద్ద ఎత్తులోనే చర్చించినట్లు తెలుస్తోంది.

Mamata Benerjee
Prashant Kishor-Mamata Banerjee: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో మరోసారి వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ మరోసారి భేటీ అయ్యారు. కోల్‌కతాలో జరిగిన ఈ మీటింగ్ లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకలాపాలపై పెద్ద ఎత్తులోనే చర్చించినట్లు తెలుస్తోంది. మూడు గంటల పాటు జరిగిన ఈ మీటింగ్ చాలా ప్రత్యేకమని చెప్తున్నారు.
రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత టీఎంసీ ప్రధాన మార్పులకు తెరదీసింది. జూన్ నెలలో వన్ మ్యాన్.. వన్ పోస్ట్ సిస్టమ్ మొదలుపెట్టింది పార్టీ. ఈ నిర్ణయం కారణంగా పార్టీ లీడర్లు ఒకొక్కరు ఒక్క పోస్ట్ మాత్రమే చేతిలో ఉంచుకోగల్గుతారు.
పార్టీ లీడర్ పార్థ ఛటర్జీ ఆర్గనైజేషన్ లో త్వరలోనే మార్పులు చేస్తామని చెప్పారు. టీఎంసీ మళ్లీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర వహించిన కిశోర్.. కూడా జూన్ లో జరిగిన ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీతో టీఎంసీ సంబంధాన్ని 2026కు కొనసాగించనుంది.