కట్నం కోసం గర్భిణీని చంపేశారు

  • Published By: madhu ,Published On : September 6, 2020 / 09:25 AM IST
కట్నం కోసం గర్భిణీని చంపేశారు

Updated On : September 6, 2020 / 9:47 AM IST

body dumped into Ganga canal : ఇంకా కట్నం వేధింపులు తప్పడం లేదు. కట్నం తీసుకరాకపోవడంతో…భార్యలను అత్తింటి వారు చంపేస్తున్నారు. తాజాగా ముజఫర్ నగర్ లో కట్నం కోసం గర్భిణీని గొంతు కోసి చంపారు. అనంతరం డెడ్ బాడీని Ganga canal లో పడేశారు.




దీనికి సంబంధించిన వివరాలను ఎస్ హెచ్ వో రాజేందర్ గిరి వెల్లడించారు. కమల్, నేహాల వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. అధికంగా కట్నం తేవాలని అత్తింటి వారు వేధింపులు చేసే వారని, ఈ క్రమంలో తన కుమార్తెను చంపేశారని తండ్రి ఆరోపించారు. విచారణలో నేహను చంపేసి Ganga canal పడేసినట్లు భర్త ఒప్పుకున్నాడు.

భర్త, మామ, అత్తతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేయడం జరిగిందని, భర్త కమల్ ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. డెడ్ బాడీని వెతికేందుకు ప్రయత్నిస్తున్నామని, రాజ్ భా ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందన్నారు. ఈమె వయస్సు 20 ఏళ్లు ఉంటుందని, చంపిన తర్వాత..కాల్వలో పడేశారన్నారు.