మదనపల్లికి రాష్ట్రపతి

President Kovind రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 4 నుంచి 7 వరకు కర్ణాటక, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో జరిగే కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 4న కర్ణాటకకు చేరుకోనున్న రాష్ట్రపతి 5న ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులోని యెలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో జరుగుతున్న ఏరో ఇండియా-2021 ఎయిర్ షోను సందర్శించనున్నారు. అనంతరం ఎయిర్ షోను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు.
ఆ తర్వాత ఆయన కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనున్నారు. ఫిబ్రవరి-7(ఆదివారం)మధ్యాహ్నాం చిత్తూరు జిల్లాలోని మదనపల్లికి రాష్ట్రపతి చేరుకోనున్నారు. ససత్సంగ్ ఫౌండేషన్ ను సందర్శించి అక్కడ ఏర్పాటుచేసిన యోగా హాల్ ని మరియు భారత్ యోగా విద్య సెంటర్ ని కోవింద్ ప్రారంభిస్తారని ఏపీ సీఎస్ ఆధిత్యనాథ్ దాస్ మంగళవారం తెలిపారు.
ఈ సందర్భంగా 38పడకల ఆసుపత్రికి రాష్ట్రపతి శంకుస్థాపన చేస్తారని..అనంతరం పీపాల్ గ్రోవ్ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించేందుకు సదమ్ ని రాష్ట్రపతి సందర్శిస్తారని సీఎస్ తెలిపారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై వివిధ డిపార్మెంట్ లతో మంగళవారం సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేశారు.