PM Modi Emotional Tweet : తల్లి మృతి పట్ల ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్

ప్రధానమంత్రి మాతృమూర్తి హీరాబెన్ (100) కన్నుమూశారు. తన తల్లి మృతి పట్ల ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు. అమ్మ భగవంతుడి చెంతకు చేరిందంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశారు.

PM Modi Emotional Tweet : తల్లి మృతి పట్ల ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్

PM MODI

Updated On : December 30, 2022 / 10:25 AM IST

PM Modi Emotional Tweet : ప్రధానమంత్రి మాతృమూర్తి హీరాబెన్ (100) కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఆమె తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించారు. అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ప్రధాని మోదీ తన తల్లి మృతి పట్ల భావోద్వేగ ట్వీట్ చేశారు.

అమ్మ భగవంతుడి చెంతకు చేరిందంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరారని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ అమ్మను దేవుని చిహ్నంగా భావించానని గుర్తు చేశారు. విలువలకు కట్టుబడిన నిస్వార్థ కర్మయోగి జీవితం గడిపారని కొనియాడారు.

PM Modi’s Mother Passed Away : ప్రధాని మోదీకి మాతృ వియోగం.. అనారోగ్యంతో హీరాబెన్ కన్నుమూత

ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిదని అభివర్ణించారు. హీరాబెన్ వయస్సు 100 సంవత్సరాలు. ఇటీవలే ఆమె తన వందో పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆ సందర్భంగా మోదీ తన తల్లి అశీస్సులు కూడా తీసుకున్నారు. హీరాబెన్ ఆమె చిన్న కొడుకు దగ్గర ఉంటున్నారు.