పరీక్షలంటే భయపడొద్దు : సవాల్‌ని ఫేస్ చేయాలి

  • Published By: veegamteam ,Published On : January 29, 2019 / 09:19 AM IST
పరీక్షలంటే భయపడొద్దు : సవాల్‌ని ఫేస్ చేయాలి

Updated On : January 29, 2019 / 9:19 AM IST

ఢిల్లీ : విద్యార్థులు పరీక్షలంటే భయపడకూడదనీ..జీవితమనే సవాల్ ను ఎదుర్కొనేలా విద్యార్ధులు సిద్ధంగా ఉండాలని మోడీ మోటివేషన్ స్పీచ్ తో పిలుపునిచ్చారు. 24 రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న సుమారు 2 వేల మందికి పైగా విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం నిర్వహించిన ఆయన, విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

 

పరీక్షలను జీవిత సమస్యగా చూడవద్దనీ..అసలైన సవాలు జీవితమనే విషయాన్ని విద్యార్ధులు గుర్తెరిగి వ్యవహరించాలని మోడీ పేర్కొన్నారు.భారతదేశ భవిష్యత్తు ఈ విద్యార్థుల చేతుల్లోనే ఉందనీ..యువత చేతిలో దేశ భవిత తనకు కనిపిస్తోందన్నారు.పరీక్షల్లో ఒత్తిడిని అధిగమించేందుకు విద్యార్ధులకు టెక్నిక్స్  చెప్పిన ప్రధాని..ఒక ప్లాన్ ప్రకారంగా లెసెన్స్ ను చదవడం ద్వారా సింపుల్ గా పరీక్షల్లో పాస్ కావచ్చన్నారు. పరీక్షల్లో వచ్చిన ర్యాంకులు  మాత్రమే ప్రధానం కాదన్నారు. ర్యాంకులు తెచ్చుకోలేని ఎంతో మంది జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుని ఎంతోమందికి మార్గదర్శకులుగా నిలిచారని ప్రధాని మోడీ పేర్కొన్నారు.