Ayodhya Ram Mandir Inauguration : ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇలా..
అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సుమారు ఐదు గంటలు కొనసాగనుంది. ఉదయం 10.45 గంటల నుంచి సాయంత్రం సాయంత్రం 3గంటల వరకు మోదీ అయోధ్యలో ఉండనున్నారు.

PM Modi
PM Modi Ayodhya Schedule : 500ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ఇవాళ్టితో తెరపడనోంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య ఆలయలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1గంటకు ముగియనుంది. ప్రధాని నరేంద్ర మోదీ గత 11 రోజులుగా పలు ఆలయాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. రామాయణ ఇతిహాసంతో ముడిపడిఉన్న ఆలయాలను సందర్శిస్తూ, కఠినమైన ఆచారాలను అనుసరిస్తున్న మోదీ .. ఇవాళ మధ్యాహ్నం ఆయోధ్యలో ప్రారంభమయ్యే పవిత్రాభిషేక కార్యరక్రమాల్లో పాల్గోనున్నారు. అయోధ్యలో మోదీ పర్యటన సుమారు ఆరు గంటలు ఉంటుంది. ఉదయం 10.45 గంటల నుంచి సాయంత్రం సాయంత్రం 4గంటల వరకు మోదీ అయోధ్యలో ఉండనున్నారు.
మోదీ అయోధ్య పూర్తి షెడ్యూల్..
- ఉదయం 9.05 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రధాని మోదీ బయలుదేరుతారు.
- ఉదయం 10.25 గంటలకు అయోధ్య విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు.
- 10.55 గంటలకు రామ మందిరానికి చేరుకుంటారు.
- మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.45 గంటల వరకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
- 12.20 గంటలకు రాముడి కళ్లకు గంతలను ప్రధాని మోదీ తొలగిస్తారు. అనంతరం బలరామునికి హారతి ఇస్తారు.
- శ్రీరాముని దర్శనం అనంతరం మధ్యాహ్నం 1.00 గంటకు వేదిక నుంచి మోదీ బయలుదేరుతారు. అనంతరం అక్కడే జరిగే సభలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆధిత్య నాథ్, మోహన్ భగవత్ లతో కలిసి పాల్గొని ప్రసంగిస్తారు.
- 2.15గంటలకు కుబేర్ తిలలోని శివాలయంలో దర్శనం అనంతరం.. పూజలు చేస్తారు.
- 2.35 గంటలకు అయోధ్యలోని హెలిప్యాడ్ వద్దకు మోదీ చేరుకుంటారు.
- 3.05 గంటలకు అయోధ్య నుంచి మోదీ బయలుదేరుతారు.
- సాయంత్రం 4.25 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు.
- మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రధాన పూజ అభిజిత్ ముహూర్తంలో ప్రారంభిస్తారు. కాశీ పండితుడు గణేశ్వర్ శాస్త్రి ప్రాణప్రతిష్ఠ ముహూర్తం నిర్ణయించారు. మధ్యాహ్నం 12.29 నుంచి 12:30 వరకు.. 32 సెకన్ల వరకు శుభముహూర్తం ఉంది. ప్రాణప్రతిష్ఠకు శుభ ముహూర్తం 84 సెకన్లు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామ్ లల్లా విగ్రహానికి ప్రతిష్ఠాపన చేస్తారు.
- రేపటి నుంచి భక్తులకు అయోధ్య రామ మందిరం అందుబాటులోకి రానుంది. రెండు స్లాట్లుగా విభజించి దర్శన సమయాలను నిర్ణయించారు. ఉదయం 7గంటల నుంచి 11.30 గంటల వరకు దర్శన సమయం ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్న 2గంటల నుంచి రాత్రి 7గంటల వరకు దర్శన సమయం ఉంటుంది. ప్రతీరోజూ మూడు హారతులు నిర్వహణ ఉంటుంది. ఉదయం 6.30 గంటలకు శృగార ఆరతి, మధ్యాహ్నం 12గంటలకు భోగ్ ఆరతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా ఆరతి ఇస్తారు.