స్వామి సంచలనం : ప్రియాంక.. బైపోలర్ డిసార్డర్ వ్యాధితో భాధపడుతోంది

ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్పందించారు. బైపోలర్ డిసార్డర్ వ్యాధితో ప్రియాంక భాధపడుతుందని స్వామి అన్నారు. ప్రజాజీవితంలో గడపడానికి ఆమె అనర్హురాలని అన్నారు. ప్రియాంకది చాలా క్రూరమైన క్యారెక్టర్ అని అన్నారు. ప్రియాంక ప్రజలను కొట్టిందని, తిట్టిందని స్వామి ఆరోపించారు. ఆమె జబ్బు కారణంగా ఆమె ప్రజాజీవితంలో గడపడానికి అర్హురాలు అవదని స్వామి తెలిపారు. ఆమె ఎప్పుడు మానసిక స్థితి కోల్పోతుందో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు.
యూపీ తూర్పు ప్రాంతానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ప్రియాంకను నియమిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె చాలా అందంగా ఉంటుందని, అందమైన ముఖాలు చూసి ప్రజలు ఓట్లు వేయరని బీహార్ బీజేపీ నేత వినోద్ నారాయణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.