జరుగుతున్న పరిణామాలు బాధిస్తున్నాయి: మోడీపై ప్రియాంకా ఫైర్

  • Published By: venkaiahnaidu ,Published On : March 12, 2019 / 03:16 PM IST
జరుగుతున్న పరిణామాలు బాధిస్తున్నాయి: మోడీపై ప్రియాంకా ఫైర్

ప్రజల ఓటే వారి చేతుల్లోని ఆయుధమన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ.కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన తర్వాత కాంగ్రెస్ నాయకురాలిగా మొట్టమొదటిసారిగా మంగళవారం(మార్చి-12,2019) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వైట్ అండ్ బ్లూ శారీలో ఎన్నికల స్పీచ్ ఇచ్చిన ప్రియాంకా పరోక్షంగా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. 2019 సార్వత్రిక ఎన్నికలు.. స్వాతంత్ర్య ఉద్యమం కంటే తక్కువేమీ కాదని ప్రియాంకా అన్నారు.

ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ…రాబోయే రెండు నెలల్లో బీజేపీ నేతలు అనేకరకాల కొత్త విషయాలను లేవనెత్తుతారు.వారిని సరైన ప్రశ్నలు అడగండి.ఇది మీ దేశం..మీరు దేశాన్ని కాపాడాలి.మీ ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు.ఆలోచించి నిర్ణయం తీసుకోండి.వాళ్లు హామీ ఇచ్చిన ఉద్యోగాలెక్కడ.ప్రజల అందరి ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామని వారు మాట్లాడిన మాటలు ఏమయ్యాయి? మహిళల రక్షణ సంగతేంటి అని మోడీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.  

తాను మొదటిసారి గుజరాత్ లో పర్యటిస్తున్నట్లు ఆమె తెలిపారు. మన వ్యవస్థలు దాడులకు గురౌతున్నాయని, దేశాన్ని రక్షించుకోవడం,కలిసికట్టుగా ముందుకు వెళ్లడం కన్నా ఏదీ పెద్ద విషయం లేదని ఆమె అన్నారు. దేశం.. ప్రేమ,సోదరభావంపైన ఆధారపడి ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు భాధాకరమన్నారు. అవగాహన కన్నా పెద్ద దేశభక్తి ఏదీ లేదని, ప్రజల చైతన్యమే ఓ ఆయుధం, ఓటే ప్రజల ఆయుధమని, ఈ ఆయుధం ఎవరినీ భాధించదు, హాని చేయదని ఆమె తెలిపారు. ఈ ఎన్నికల ర్యాలీ ప్రియాంకా గాంధీ స్పీచ్ కి మంచి రెస్ఫాన్స్ వచ్చింది.

గతంలో తల్లి సోనియా,అన్న రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ,రాయబరేలీ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రియాంకా ప్రచారం నిర్వహించింది. యూపీ తూర్పు ప్రాంతానికి కాంగ్రెస్ ఇంచార్జిగా ప్రియాంకాగాంధీ ఈ ఏడాది జనవరిలో నియమితులైన విషయం తెలిసిందే.