పబ్లిసిటీ కాదు..సింప్లిసిటీ అసలే కాదు : కారు దిగి బస్సు ఎక్కిన మంత్రి 

  • Published By: veegamteam ,Published On : January 4, 2020 / 04:22 AM IST
పబ్లిసిటీ కాదు..సింప్లిసిటీ అసలే కాదు : కారు దిగి బస్సు ఎక్కిన మంత్రి 

Updated On : January 4, 2020 / 4:22 AM IST

పుదుచ్చేరి వ్యవసాయ శాఖా మంత్రి కమలకన్నన్ బస్సులో ప్రయాణించారు. ఇదేదో పబ్లిసిటీ కోసం కాదు. క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు మంత్రి కమలకన్నన్ తన కారులో బయలుదేరారు. పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్లారు. కానీ బంక్ సిబ్బంది మంత్రిగారి కారులో పెట్రోల్ పోయనని చెప్పారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రి కారు దిగి  క్యాబినెట్ మీటింగ్ కు హాజరయ్యేందుకు బస్సు ఎక్కి ప్రయాణించాల్సి వచ్చింది.

ఇంతకీ పెట్రోల్ బంక్ లో మంత్రిగారి కారును పెట్రోల్ ఎందుకు పోయలేదో తెలుసుకుందాం..ప్రభుత్వ శాఖల నుంచి పెండింగ్ లో ఉన్న బకాయిలను  దృష్టిలో ఉంచుకున్న కోఆపరేటివ్ పెట్రోల్ స్టేషన్ మంత్రిగారి కారులో ఇంధనం నింపటానికి నిరారించింది. ప్రభుత్వ వాహనాలకు పెట్రోల్, డీజిల్ కోసం ప్రభుత్వ శాఖల నుంచి మొత్తం రూ.2.5 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో మంత్రి కారులో బంక్ యాజమాన్యాల నిర్ణయంతో బంక్ సిబ్బంది ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలకు ఇంధనం నిప్పట్లేదు. ఇదే విషయాన్ని బంక్ సిబ్బంది మంత్రిగారికి వివరించారు. దీంతో మంత్రి కారు దిగి బస్సులో వెళ్లాల్సి వచ్చింది. 

జనవరి 2 నుండి ప్రభుత్వ వాహనాలకు డీజిల్ అందించడానికి వ్యతిరేకంగా సహాకార పెట్రోల్ బంక్ యాజమాన్యలకు సంబంధించిన సంఘం నిర్ణయించినట్లు, దాని మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత విభాగాలు పెండింగ్‌లో ఉన్న బకాయిలను క్లియర్ చేసేదాకా ప్రభుత్వ వాహానాల్లో ఇంధనాలు నింపవద్దని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.