Viral Video: ఈ వయసులో.. తలపై చెరుకుగడలు పెట్టుకుని 14 కి.మీ సైకిల్ తొక్కి..

చివరకు ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి చెల్లదురై తన కూతురికి...

Viral Video: ఈ వయసులో.. తలపై చెరుకుగడలు పెట్టుకుని 14 కి.మీ సైకిల్ తొక్కి..

An elderly man carried a bunch of sugarcane on his head and rode a bicycle

Updated On : January 15, 2024 / 4:59 PM IST

కూతురిపై తండ్రి ఎంతో ప్రేమానురాగాలను కురిపిస్తాడు. పండుగ వచ్చిదంటే కూతుళ్లతో ఎంతో సరదాగా గడుపుతాడు. కూతురికి పెళ్లయి అత్తారింటికి వెళ్లిపోతే.. పండుగ రోజున తన చిట్టితల్లి తన పక్కన లేకపోతే ఎంతో దిగులుగా ఉంటుంది. కొందరు పండుగ రోజు కూతురి ఇంటికి వెళ్లి మరీ ఆమెను చూసి వస్తుంటారు. సంప్రదాయబద్ధంగా ఆమెకు కానుకలూ ఇచ్చి వస్తారు. ఇటువంటి తండ్రి కథే ఇది.

కూతురి కోసం ఒకాయన తలపై చెరుకుగడలు పెట్టుకుని, అంతటి బరువుని మోస్తూ 14 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. తమిళనాడులోని పుదుక్కోట్టైలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ప్రజలు అందరూ సంక్రాంతి పండుగ సందడిలో ఉన్నారు. పుదుక్కోట్టైలోనూ ప్రజలు పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంక్రాంతికి తన కూతురిని చూడకుండా, ఆమెతో కలిసి ఈ పండుగ జరుపుకోకుండా ఉండలేరు చెల్లదురై అనే వృద్ధుడు. ఆయన కూతురికి ఎన్నో ఏళ్ల పాటు పిల్లలు పుట్టలేదు.

చివరకు ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి చెల్లదురై తన కూతురికి, మనవళ్లకు పొంగల్ గిఫ్ట్‌ ఇస్తున్నారు. ప్రతి సారి ఇలాగే సంక్రాంతి ముందు పూజలు చేసి, తలపై చెరుకుగడలు పెట్టుకుని ఆమె ఇంటికి వెళ్తున్నారు. ఆయన సైకిల్‌పై వెళ్తున్న సమయంలో చాలా మంది వింతగా ఆయననే చూశారు.

ఫొటోలు, వీడియోలు తీశారు. తాను చాలా సంతోషంగా సైకిల్ పై తన కూతురి వద్దకు వెళ్లి, తన కూతురు, మనవళ్లను చూసి వస్తున్నానని చెల్లదురై చెప్పారు. తాను ఈ వయసులోనూ ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.

Punjab : ప్రియురాలి కోసం గెట‌ప్ మార్చావు స‌రే.. అస‌లు విష‌యం మ‌రిచిపోయావుగా..!