Gurpreet Gogi: అనుమానాస్పద స్థితిలో ఆప్ ఎమ్మెల్యే మృతి.. కుటుంబ సభ్యులు ఏం చెప్పారంటే..

AAP MLA Gurpreet Gogi: పంజాబ్ లోని లూథియానా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగి (58) శుక్రవారం రాత్రి తలలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో మృతిచెందాడు.

Gurpreet Gogi: అనుమానాస్పద స్థితిలో ఆప్ ఎమ్మెల్యే మృతి.. కుటుంబ సభ్యులు ఏం చెప్పారంటే..

AAP MLA Gurpreet Gogi

Updated On : January 11, 2025 / 9:31 AM IST

AAP MLA Gurpreet Gogi: పంజాబ్ లోని లూథియానా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగి (58) శుక్రవారం రాత్రి తలలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో మృతిచెందాడు. ఈ ఘటన జరిగిన వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు డీఎంసీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన తలలో రెండు బులేట్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఎవరైనా అతనిపై కాల్పులు జరిపారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు మాత్రం.. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి తలలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయని, దీంతో ఆయన మరణించారని చెప్పారు.

Also Read: Tirupati Stampede Incident : తొక్కిసలాట ఘటనపై భక్తులకు క్షమాపణలు చెప్పిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు..

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 12గంటల సమయంలో గోగి తన ఇంట్లో లైసెన్స్ కలిగినఉన్న తుపాకిని శుభ్రం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా పేలి బుల్లెట్లు అతని తలలోకి దూసుకెళ్లాయని తెలిపారు. ఘటన సమాచారం అందిన వెంటనే డిప్యూటీ కమిషనర్ జితేంద్ర జోర్వాల్, పోలీస్ కమిషనర్ కుల్దీప్ చాహల్ ఆస్పత్రి వద్దకు వెళ్లారు. కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ కుల్దీప్ సింగ్ చాహల్ పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఏడీసీసీ జస్కరన్ సింగ్ తేజ తెలిపారు.

Also Read: Road Accident: మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు

పోలీసుల ప్రాథమిక విచారణలో.. శుక్రవారం గోగి ఆప్ రాజ్యసభ ఎంపీ సంత్ బల్వీర్ సింగ్ సీచెహల్ ను కలవడంతోపాటు అనేక ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం సమయంలో ఇంటికి చేరుకున్నాడు. కొంత సమయం తరువాత గోగి గది నుంచి తుపాకీ శబ్దం వినిపించడంతో అతని భార్య, కొడుకు, భద్రతా సిబ్బంది గది వద్దకు చేరుకొని చూడగా అతడు రక్తంతో నేలపై పడిఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బంది అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరిలించగా.. వైద్యులు పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులను ప్రశ్నించగా.. తుపాకీ శుభ్రం చేస్తున్న సమయంలో పొరపాటున బుల్లెట్లు తలలోకి దూసుకెళ్లాయని చెప్పారని డీసీపీ జస్కరన్ సింగ్ తేజ తెలిపారు.

 

2022లో ఆప్ పార్టీలో చేరిన గోగీ.. లుథియానా నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. రెండుసార్లు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భరత్ భూషణ్ అషుపై విజయం సాధించాడు. ఆప్ పార్టీలో చేరకముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గోగీకి పీఎస్ఐఈసీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించింది. అతను 2014 నుంచి 2019 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేశారు.


గురుప్రీత్ గోగి మృతిపై పంజాబ్ మంత్రి హర్దీప్ సింగ్ ముండియన్ మాట్లాడుతూ.. గోగి మృతి వార్తవిని దిగ్భ్రాంతికి గురయ్యాను. పార్టీకి, వ్యక్తిగతంగా నాకు గోగి మరణం తీరనినష్టం. అతను నాకు అన్నయ్య లాంటివాడని పేర్కొన్నాడు.