కిసాన్ యూనియన్స్ కి పంజాబ్ సీఎం విజ్ణప్తి

  • Published By: venkaiahnaidu ,Published On : November 9, 2020 / 09:27 PM IST
కిసాన్ యూనియన్స్ కి పంజాబ్ సీఎం విజ్ణప్తి

Updated On : November 9, 2020 / 9:49 PM IST

Punjab CM appeals Kisan Unions to lift rail blockade to allow passenger trains మోడీ సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను పలు రాష్ట్రాలతో పాటుగా పంజాబ్ రైతులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్ ‌లో అయితే నిరసనలు, ధర్నాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల రవాణా వ్యవస్థ దాదాపుగా నిలిచిపోయింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రైళ్లు తిరగకుండా రైలు పట్టాలపై రైతులు నిరసన చేపడుతున్నారు.



అయితే, ప్రయాణికుల రైళ్లను తిరిగేలా చూడాలని వాటిని అడ్డుకోకుండా ఉండాలని రైతు సంఘాలను పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కోరారు. వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని ఆయన పేర్కొన్నారు. రైతులకు నష్టం జరిగే ఏ చట్టాన్ని తాము ఆమోదించబోమని, అదే విధంగా ప్రజా జీవనాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని అమరీందర్ సింగ్ అన్నారు.



వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ “రైల్ రోకో” ఆందోళనను ప్రారంభించిన సెప్టెంబర్ 24 నుండి పంజాబ్ లో రైలు సర్వీసులు నిలిపివేయబడిన విషయం తెలిసిందే .అక్టోబర్ 21 న రైతు సంఘాలు తమ “రైల్ రోకో” ఆందోళన నుండి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించిన తరువాత గూడ్స్ రైళ్లు కొన్నిరోజులు తిరిగి ప్రారంభమయ్యాయి, కానీ రైతులు ఇప్పటికీ ట్రాక్‌లను అడ్డుకుంటున్నారనే కారణంతో రైల్వే వాటిని మళ్ళీ సస్పెండ్ చేసింది.