పదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన బర్త్ డే కేక్.. పోలీసులు ఏం చేశారంటే?
మాన్వి కేక్ తిన్నతరువాత వాంతులు చేసుకొని పడుకుంది. మధ్యలో రెండు సార్లులేచి నీళ్లు కావాలని అడిగింది. గొంతు ఎండిపోతుంది.. చాలా దాహంగా ఉందని చెప్పింది.

Birthday Girl Death
Patiala Birthday Girl Death : పంజాబ్ రాష్ట్రం పాటియాలాలో ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పదేళ్ల చిన్నారి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆన్ లైన్ లో కేక్ ఆర్డర్ చేశారు. అంతేకాదు.. అందరూ సంతోషంగా రాత్రివేళ చిన్నారి బర్త్ డే వేడుకల్లో పాల్గొని చిన్నారికి కేక్ తినిపించారు. మురుసటి రోజు బాలికకు ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు మెరుగైన చికిత్స నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. చిన్నారి మృతికి కారణం ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసిన కేక్ అని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన మార్చి 24న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read : Katha Venuka Katha : ‘కథ వెనుక కథ’ మూవీ రివ్యూ.. ఓటీటీలో మరో సస్పెన్స్ థ్రిల్లర్..
చిన్నారి మరణానికి కొన్ని గంటల ముందు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో చిన్నారి తన పుట్టినరోజును జరుపుకుంటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. వీడియోలో బాలిక క్షేమంగా కనిపించింది. ఇదిలాఉంటే.. ఈ ఘటనపై మృతురాలి తాతయ్య మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో ఓ బేకరీ నుంచి కేక్ ఆర్డర్ చేయగా.. 6.15 గంటలకు కేక్ వచ్చింది. 7.15గంటలక కేక్ కట్ చేశారు. అది తిన్నాక ఇంట్లో అందరి ఆరోగ్యం క్షీణించింది. తలలు తిరిగాయి. ఇద్దరు చిన్నారుల్లో ఒకరికి 10ఏళ్లు. పుట్టిన రోజు జరుపుకునే చిన్నారి పేరు మాన్వి. ఆమె చెల్లికి ఎనిమిదేళ్లు. కేక్ తినగానే ఇద్దరూ వాంతులు చేసుకున్నారు. మృతురాలి చెల్లికి బాగా వాంతి కావడంతో కేక మొత్తం బయటకు వచ్చేసింది. మాన్వికి కూడా వాంతులు అయ్యాయి.
Also Read : వలసలను నిలువరించలేకపోతున్న గులాబీబాస్.. ఏం జరుగుతోందో తెలుసా?
మాన్వి కేక్ తిన్నతరువాత వాంతులు చేసుకొని పడుకుంది. మధ్యలో రెండు సార్లులేచి నీళ్లు కావాలని అడిగింది. గొంతు ఎండిపోతుంది.. చాలా దాహంగా ఉందని చెప్పింది. ఆ తరువాత మాన్వి నిద్ర పోయింది. అయితే, తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో ఆమె వద్దకు వెళ్లి చూడగా.. తీవ్ర అస్వస్తతకు గురైనట్లు గుర్తించి కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చిన్నారిని పరీక్షించి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించారు. మెరుగైన వైద్యం అందించినప్పటికీ చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతిచెందింది. ఆన్ లైన్ కేక్ వల్లనే మాన్వి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో బేకరీ యాజమానిపై ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేక్ నమూనాలను కూడా సేకరించి పరీక్షల కోసం పంపించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాత అసలు విషయం తెలుస్తుందని చెప్పారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
The grandfather of the 10-year-old girl who died after eating cake on her birthday briefed about the whole incident. #patiala pic.twitter.com/g1oLk6Okbo
— Gagandeep Singh (@Gagan4344) March 30, 2024