ఇకనైనా వ్యవసాయ చట్టాలను రద్దు చేయండి

rahul-gandhi--farm-laws1
Rahul Gandhi నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. జనవరి 26న రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈ మేరకు ట్వీట్ చేశారు.
హిందీలో చేసిన ట్వీట్ లో రాహుల్.. సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర సర్కారుకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. విధేయతతో ఉంటూనే.. ప్రపంచాన్ని కదిలించొచ్చు అని మహాత్మా గాంధీ వ్యాఖ్యలను తన ట్వీట్ లో జోడించారు.
ఇక,ఢిల్లీలో ఆందోళనకారులు హింసాత్మక ఘటనలవైపు మళ్లడాన్ని కూడా రాహుల్ తప్పుబట్టారు. ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాదని మంగళవారం రైతులకు రాహుల్ విజ్ణప్తి చేసిన విషయం తెలిసిందే..జాతీయ ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని చట్టాలను రద్దు చేయాలని మంగళవారం చేసిన ట్వీట్ కేంద్రాని రాహుల్ కోరారు.
“विनम्र तरीक़े से आप दुनिया हिला सकते हैं।”
-महात्मा गांधी
एक बार फिर मोदी सरकार से अपील है कि तुरंत कृषि-विरोधी क़ानून वापस लिए जाएँ।
— Rahul Gandhi (@RahulGandhi) January 27, 2021