Rahul Gandhi: దటీజ్ రాహుల్ .. పార్లమెంట్‌‌‌లోకి ప్రవేశించే ముందు రాహుల్ గాంధీ ఏం చేశారో చూశారా.. వీడియో వైరల్

కాంగ్రెస్ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన ఈ వీడియోకు ‘జన్నాయక్ (పీపుల్స్ హీరో) అనే క్యాప్షన్ ఇచ్చారు. వీడియోను చూసిన నెటిజన్లు రాహుల్ తీరుపట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.

Rahul Gandhi: దటీజ్ రాహుల్ .. పార్లమెంట్‌‌‌లోకి ప్రవేశించే ముందు రాహుల్ గాంధీ ఏం చేశారో చూశారా.. వీడియో వైరల్

Rahul Gandhi

Congress Leader Rahul Gandhi: మోదీ ఇంటిపేరు కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. దీంతో మళ్లీ రాహుల్ పార్లమెంట్‌లోకి అడుగు పెట్టారు. బుధవారం కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై రెండో రోజు పార్లమెంట్‌లో చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా మాట్లాడిన రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rahul Gandhi : హిందుస్థాన్ ను హత్య చేశారు.. మీరు దేశ భక్తులు కాదు దేశద్రోహులు.. లోక్ సభలో రాహుల్ గాంధీ

అయితే, బుధవారం రాహుల్ గాంధీ పార్లమెంట్‌లోకి ప్రవేశించే ముందు రహదారిపై ఓ వ్యక్తి స్కూటర్ పైనుండి పడిపోయాడు. కారులో వెళ్తున్న రాహుల్ దీనిని గమనించి, కారును పక్కకు ఆపించి వెంటనే స్కూటర్‌పై నుంచి కిందపడిన వ్యక్తి వద్దకు వెళ్లాడు. స్కూటర్‌ను సహాయక సిబ్బందితో పైకిలేపి కింద పడిన వ్యక్తిని పరామర్శించాడు. ఏమైనా గాయాలయ్యాయా అని ఆరా తీశారు. అనంతరం సదరు వ్యక్తికి సేక్‌హ్యాడ్ ఇచ్చి అక్కడి నుంచి రాహుల్ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.

 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, కాంగ్రెస్ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన ఈ వీడియోకు ‘జన్నాయక్ (పీపుల్స్ హీరో) అనే క్యాప్షన్ ఇచ్చారు. వీడియోను చూసిన నెటిజన్లు రాహుల్ తీరుపట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.