వాయనాడ్‌లో విచిత్రం : రాహుల్ గాంధీ పోటీగా మరో రాహుల్ గాంధీ

లోక్ సభ  ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

  • Published By: madhu ,Published On : April 6, 2019 / 11:48 AM IST
వాయనాడ్‌లో విచిత్రం : రాహుల్ గాంధీ పోటీగా మరో రాహుల్ గాంధీ

లోక్ సభ  ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

లోక్ సభ  ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. పలు రాష్ట్రాల్లో విచిత్రమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకే నేమ్‌తో అభ్యర్థులుండడంతో ప్రధాన పార్టీలకు చెమటలు పడుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి ఉత్తరాధిలోని అమేధీ, రెండోది దక్షిణాదిన కేరళలోని వాయనాడ్‌. అయితే వాయనాడ్‌లో రాహుల్ గాంధీ పేరిట అభ్యర్థులు బరిలో ఉండడం..మరొకరు గాంధీ పేరిట ఎన్నికల్లో పోటీలో నిలిచారు. 
Read Also : ఓటు వేయండి : పెట్రోల్, డీజిల్ పై 50 పైసలు డిస్కాంట్ పొందండి

రాహుల్ గాంధీకి ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థి పేరు కూడా కేఈ రాహుల్ గాంధీయే కావడం విచిత్రం. ఇతను అగిల ఇండియా మక్కల్ కళగమ్ పార్టీకి చెందిన వారు. కోయంబత్తూర్‌కు చెందిన కె.రాగుల్ గాంధీ, కె.ఎం. శివప్రసాద్ గాంధీలు రాహుల్‌తో పోటీ పడుతున్నారు. కె.ఈ రాహుల్ గాంధీ అఫిడవిట్ దాఖలు చేశారు. ఎం.ఫిల్ డిగ్రీ పొందినట్లు..పాన్ కార్డు లేదని పేర్కొన్నారు. రూ. 5వేల నగదు, బ్యాంకులో రూ. 515 డబ్బున్నట్లు తెలిపారు. రిపోర్టర్‌గా పనిచేస్తున్నట్లు, భార్య డెంటల్ టెక్నీషియన్‌గా వర్క్ చేస్తున్నట్లు వెల్లడించాడు. వాయనాడ్‌లో ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనుంది. మొత్తానికి ఓటర్లు మాత్రం కొంత కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉంది. ఇది ఎంత ప్రభావం చూపుతుందోనని కాంగ్రెస్ నేతలు టెన్షన్ పడుతున్నారంట. 
Read Also : పాలన చూసి ఎన్నుకోండి : మేం వద్దంటే.. మరొకరికి ఛాన్స్