Rahul Gandhi : లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ!

లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా రాహుల్‌గాంధీని కాంగ్రెస్ ప్ర‌క‌టించబోతున్నట్లు సమాచారం.

Rahul Gandhi : లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ!

Rahul (1)

Updated On : July 14, 2021 / 5:26 PM IST

Rahul Gandhi లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా రాహుల్‌గాంధీని కాంగ్రెస్ ప్ర‌క‌టించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం లోక్ సభలో ప్రతిపక్ష నేతగా అధిర్ రంజన్ చౌదరి ఉన్నారు. రాబోయే 48గంటల్లో ఓ సమావేశం నిర్వహించి చౌదరి స్థానంలో రాహుల్ గాంధీని లోక్ సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ప్రకటించబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయ‌న‌తోపాటు మ‌నీష్ తివారీ, శ‌శి థరూర్‌, గౌర‌వ్ గొగొయ్‌, ర‌వ్‌నీత్ సింగ్ బిట్టుల పేర్ల‌ను ఆ పార్టీ ప‌రిశీలిస్తోంది.

రాహుల్ ఈ బాధ్య‌త‌లు తీసుకోవ‌డానికి సిద్ధంగా లేర‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నా.. ఆయ‌నే ముందు వ‌రుస‌లో ఉన్న‌ట్లు ఓ సీనియ‌ర్ కాంగ్రెస్ నేత తెలిపారు. ర‌ఫేల్ డీల్‌పై ఈ నెల-19 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని చూస్తున్న కాంగ్రెస్‌..ఓ బ‌ల‌మైన నేత‌ను త‌మ ప‌క్ష నేత‌గా నియ‌మించాల‌ని చూస్తోంది. ఇందులో భాగంగానే రాహుల్ ని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.

మరోవైపు,.రాజ్య‌స‌భ‌లో లీడ‌ర్ ఆఫ్ ద హౌజ్‌గా కేంద్రమంత్రి పియూష్ గోయ‌ల్‌ ని బుధవారం బీజేపీ ప్రకటించింది. మొన్నటివరకు రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద హౌజ్‌గా ఉన్న థావ‌ర్‌చంద్ గెహ్లాట్‌ను ఇటీవల క‌ర్ణాట‌క గ‌వ‌ర్న‌ర్‌గా కేంద్రప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. దీంతో రాజ్యసభలో ఆ కీల‌క‌మైన బాధ్య‌త‌లను కేంద్రప్రభుత్వంలో కీలక మంత్రిత్వశాఖలను నిర్వహిస్తున్న మరియు 2010 నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న పియూష్ గోయ‌ల్‌కు బీజేపీ అప్ప‌గించింది.