Rahul Gandhi: భారత్ దాడుల గురించి పాకిస్తాన్‌కు ముందే ఎలా చెప్తారు- కేంద్రంపై రాహుల్ గాంధీపై ఫైర్..

ఆపరేషన్ గురించి ముందే చెప్పటంతో భారత్ తీవ్రంగా నష్టపోయిందన్నారు రాహుల్.

Rahul Gandhi: భారత్ దాడుల గురించి పాకిస్తాన్‌కు ముందే ఎలా చెప్తారు- కేంద్రంపై రాహుల్ గాంధీపై ఫైర్..

Updated On : May 17, 2025 / 11:20 PM IST

Rahul Gandhi: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ వ్యవహారంలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. భారత్ చేపట్టబోయే ఆపరేషన్ గురించి పాకిస్తాన్ కు ముందే ఎలా చెప్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇండియా దాడి చేస్తుందని ముందుగానే పాకిస్తాన్ కు చెప్పడం నేరమన్నారు.

ఆపరేషన్ సిందూర్ గురించి పాక్ కు ముందుగానే చెప్పినట్లు విదేశాంగమంత్రి జైశంకర్ ప్రకటించడంపై రాహుల్ సీరియస్ అయ్యారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో జైశంకర్‌ మాట్లాడినట్లు ఉన్న వీడియోను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భారత ప్రభుత్వం ఆపరేషన్‌కు ముందు పాకిస్తాన్‌కు సమాచారం ఇచ్చిందని జైశంకర్ బహిరంగంగా చెప్పారని, అలా సమాచారం ఇవ్వడం నేరం అని రాహుల్ గాంధీ అన్నారు.

ఇలా చేయడం వల్ల ఆపరేషన్ లో ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ లు ధ్వంసం అయ్యాయో చెప్పాలని కేంద్రాన్ని నిలదీశారు. ఆపరేషన్ గురించి ముందే చెప్పటంతో భారత్ తీవ్రంగా నష్టపోయిందన్నారు రాహుల్. భారత్ తీసుకోబోయే చర్యపై లీకులు ఇవ్వాల్సిందిగా ఎవరు ఆదేశించారో చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్.

Also Read: హర్యానాలో ఐఎస్ఐ ఏజెంట్..! యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ టూర్ ఫొటోలు, వీడియోలు వైరల్..

పాక్ పై భారత్ దాడికి దిగబోతోందని జైశంకర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు రాహుల్ గాంధీ. మిలిటరీపైన కాకుండా మేము ఉగ్రస్థావరాలపై దాడి చేస్తున్నాం. జైశంకర్ మాట్లాడటం అందులో ఉంది. ”ఆపరేషన్ ప్రారంభంలో, మేము ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలపై దాడి చేస్తున్నామని పాకిస్తాన్‌కు సందేశం పంపాము. మేము సైన్యంపై దాడి చేయడం లేదు. కాబట్టి ఈ దాడిలో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండేందుకు మిలటరీకి అవకాశం ఉంది. కానీ, వారు ఆ మంచి సలహా తీసుకోలేదు” అని విదేశాంగ మంత్రి జైశంకర్ అనడం అందులో ఉంది.