Rajasthan: పని చేసిన డబ్బులు ఇమ్మన్నందుకు దళిత వ్యక్తిపై దాడి, మూత్రం తాగించి, చెప్పుల దండ వేసి..
ఈ తతంగాన్ని నిందితుల్లో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా పోలీసులు ఫిర్యాదు తీసుకుని విచారణ చేపట్టారు. బాధితుడిని ఐదు గంటల పాటు విపరీతంగా కొట్టారని, ఒక వ్యక్తి అడ్డు రాబోతే అతడిని కొట్టారని పోలీసులు తెలిపారు.

Rajasthan Dalit man beaten, forced to drink urine for demanding payment for work
Rajasthan: కొద్ది రోజుల క్రితమే రాజస్తాన్ రాష్ట్రంలో ఒక దళిత విద్యార్థి పాఠశాలలోని కుండలో నీళ్లు తాగాడని టీచర్ కొట్టడంతో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన దేశాన్ని కుదిపివేసింది. ఇది మరువక ముందే రాష్ట్రంలో మరో ఘటన చోటు చేసుకుంది. ఒక దళిత వ్యక్తి తాను చేసిన పనికి డబ్బులు అడిగినందుకు దాడి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక్క దాడేనా, మూకుమ్మడిగా కొట్టి ఆపై మూత్రం తాగించి, ఆపై చెప్పులు మెడలో వేసి తిప్పారు. రాష్ట్రంలోని సిరోహి జిల్లాలో జరిగిన ఘటన ఇది.
బాధితుడి పేరు భరత్ కుమార్ (38). అతడు ఎలక్ట్రీషియన్. నవంబర్ 19న ఒక ఇంట్లో ఎలక్ట్రీషియన్ పని చేసి 21,100 రూపాయల బిల్లు అడిగాడు. అందుకు ఒప్పుకుని మొదటి 5,000 రూపాయలు ఇచ్చారు. మిగతావి తర్వాత ఇస్తామని చెప్పారు. అనంతరం నవంబర్ 23న రోజులకు ఒక దాబా దగ్గరికి వెళ్లి తన పనికి రావాల్సిన డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. అయితే రాత్రి 9 గంటలకు ఇంటికి రావాల్సిందిగా చెప్పారు.
వాళ్లు చెప్పిన ప్రకారమే.. రాత్రి 9:10 గంటలకు ఇంటికి వెళ్లాడు. అతడిని చాలా సేపు వెయిట్ చేయించారు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వలేదు. దీంతో తనకు రావాల్సిన డబ్బులపై భరత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతే, అతడి చుట్టు కొద్ది మంది చేరి విపరీతంగా కొట్టారు. అనంతరం అతడికి బలవంతంగా మూత్రం తాగించారు. చెప్పులు మెడలో వేసి బయట తిప్పారు.
ఈ తతంగాన్ని నిందితుల్లో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీని ఆధారంగా పోలీసులు ఫిర్యాదు తీసుకుని విచారణ చేపట్టారు. బాధితుడిని ఐదు గంటల పాటు విపరీతంగా కొట్టారని, ఒక వ్యక్తి అడ్డు రాబోతే అతడిని కొట్టారని పోలీసులు తెలిపారు.
Amruta Fadnavis: గవర్నర్ కోశ్యారిపై మహారాష్ట్ర మండిపడుతుంటే.. వెనకేసుకొచ్చిన ఫడ్నవీస్ సతీమణి