Rajasthan new CM: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ.. మహారాణికి మొండిచేయిచ్చిన అధిష్టానం
భజన్ లాల్ శర్మ రాష్ట్రంలోని భరత్‌పూర్ నివాసి. బయటి వ్యక్తి అన్న ఆరోపణ ఉన్నప్పటికీ సంగనేరు నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్‌కు చెందిన పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48,081 ఓట్లతో విజయం సాధించారు

రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పేరుపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. జైపూర్‌లో జరిగిన భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో భజన్ లాల్ శర్మను అసెంబ్లీ లీడర్ గా ఆమోదించారు. రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తొమ్మిది రోజుల తర్వాత సీఎం పేరు ఖరారు కావడం గమనార్హం. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భజన్‌లాల్ శర్మ సంగనేర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.. ఆయన అసెంబ్లీకి ఎన్నిక కావడం ఇదే మొదటిసారి.
భజన్ లాల్ శర్మ రాష్ట్రంలోని భరత్‌పూర్ నివాసి. బయటి వ్యక్తి అన్న ఆరోపణ ఉన్నప్పటికీ సంగనేరు నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్‌కు చెందిన పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48,081 ఓట్లతో విజయం సాధించారు. ఆయన ఆర్ఎస్ఎస్, బీజేపీలో చాలా చురుగ్గా ఉన్న వ్యక్తి. ఈ కారణంతోనే బీజేపీ హైకమాండ్ ఆయనను ప్రతిపాదించినట్లు చెవులు కొరుక్కుంటున్నారు.
#WATCH | BJP names Bhajanlal Sharma as the new Chief Minister of Rajasthan pic.twitter.com/j3awHnmH7k
— ANI (@ANI) December 12, 2023
ఇది కూడా చదవండి: గుప్తనిధుల పేరుతో 11 హత్యలు, పోలీసుల అదుపులో సీరియల్ కిల్లర్.. తీర్థంలో పాయిజన్ ఇచ్చి
అయితే రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు బీజేపీ అధిష్టానం మొండి చేయి చూపించింది. రాజ కుటుంబానికి చెందిన ఆమె.. ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం పెద్ద ఎత్తునే జరిగింది. వాస్తవానికి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా కొత్త ముఖాలనే ముఖ్యమంత్రులుగా బీజేపీ ఎంపిక చేసింది. చివరగా రాజస్థాన్ లో కూడా కొత్త ముఖానికి అవకాశం ఇస్తారనే చర్చ కూడా నడిచింది. దీనిని నిజం చేస్తూ భజన్ లాల్ సింగ్ పేరును ముఖ్యమంత్రిగా నిర్ణయించింది.
ఇకపోతే.. ముఖ్యమంత్రితో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను కూడా ఎంపిక చేశారు. అందులో ఒకరు దియా కుమారి కాగా.. మరొకరు ప్రేమ్ చంద్ బైర్వా. అయితే దియా కుమారి ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఆమె పేరు బాగానే వినిపించింది. మహిళతో పాటు ఆమె కూడా రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. దీంతో వసుంధర రాజే సక్సెసర్ దియా కుమారి అని గట్టిగానే వినిపించింది. అయితే ఆమెను డిప్యూటీగా ఎంపిక చేసింది కమల అధిష్టానం.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్యేగా ఓడిపోయిన అభ్యర్థి సీఎం ఎలా అవుతారు? రాజ్యాంగంలోని ఈ విషయం ఏం చెప్తుందంటే?