రజనీకాంత్ తక్కువాడేంకాదు: సినిమాలు చేస్తూనే పార్టీ పెట్టేస్తున్నాడు

అభిమానులతో మీటింగ్లు, సన్నిహితులతో సమాలోచనల తర్వాత రజనీకాంత్ పూర్తిగా రాజకీయ బరిలోకి దిగడానికి సిద్ధమైపోయారు. మిషన్ 365 పేరుతో పార్టీపెట్టిన యేడాదిలోనే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్లాన్ చేసేస్తున్నారు.
ఎప్రిల్ లో పార్టీ ప్రకటన తర్వాత జనంలోకి వెళ్లాలన్నది రజనీకాంత్ ఆలోచన. సెప్టెంబర్ లో భారీఎత్తున పార్టీ మీటింగ్ పెట్టేసి, ఉప్పెనలా జనాల్లోకి వెళ్లిపోయి, అక్కడ నుంచి రాజకీయ ప్రస్థానంని పూర్తిగా మొదలెట్టేస్తారని సన్నిహితులు గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికే రజనీకాంత్ 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ స్థాయి కమిటీ సభ్యులను ఎంపిక చేసేశారు. దీనికి సంబంధించి 80శాతం పని పూర్తయ్యింది. మరో మూడునెలల్లో మిగిలిన పార్టీ పనులను పూర్తిచేశారు. ఇప్పటికే రెండు సినిమాల మీద సైన్ చేసిన రజనీకాంత్ పార్టీ పనుల్లో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నదానిమీదనే సందేహాలున్నాయి.
అయినప్పటికీ పార్టీ నిర్మాణానికి పునాదిరాళ్లు పడ్డాయి. ఇప్పుడు విధివిధానాలమీద చర్చలు సాగుతున్నాయి. బీజేపీతో భావజాల సారూప్యం ఉంటుంది తప్ప, పార్టీకి అనుకూలం కాదన్నది రజనీ సన్నిహితుల మాట. అదే సమయంలో మ్యానిఫేస్టోలో ఏం అంశాలు చర్చించాలో ముందుగానే అంచనా వేస్తున్నారు. ప్రజాకర్షక విధానాల్లో డీఎంకేది తిరుగులేని రికార్డు. మరి ఏ కొత్త పథకాలను ప్రకటిస్తే ఓటర్లు ఆకర్షితులవుతారనే దానిపై రజనీకాంత్‌కు కచ్చితమైన అభిప్రాయం ఉందని, తమిళనాడుని సంక్షేమ రాష్ట్రంగా మార్చితీరుతాని అభిమానులు ఆశిస్తున్నారు.
2017 డిసెంబర్ లో సూపర్ స్టార్ కొత్త పార్టీని ప్రకటించారు. 2021 ఎన్నికలకు సిద్ధంకావడానికి 365 రోజుల ప్లాన్ ను సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఎప్రిల్ లో పార్టీ విధి,విధానాలను జనం ముందుంచుతారు. నిజానికి కొత్త పార్టీకోసం కమల్ హాసన్ కన్నా మంచి సమయాన్నే రజనీ ఎంచుకున్నారు. తన అభిమానుల్లో ఎక్కువమంది దళితులు, బహుజనులు. ముందు ఈ వర్గాలను దగ్గర కావడానికే దళితహీరో పాత్రలను పోషించారు. కబాలి, కాలా సినిమాల్లో హీరోలు నిమ్నవర్గాలకు చెందినవాళ్లే. అందుకే డిఎంకె, అన్నాడిఎంకె, కమల్ హాసన్ పార్టీలకన్నా తనకే ఎక్కువ ప్రజాదన్ను ఉందన్నది రజనీకాంత్ అంచనా.
ఇప్పటికే Rajini Makkal Mandram (RMM) ద్వారా పార్టీ పనులను చక్కబెడుతున్నారు. CAAకి అనుకూలంగా మాట్లాడి మోడీ మద్దతుదారుడిగా పేరుపడటం వెనుక వెనుక రాజకీయ ప్రయోజనం తక్కువ. అదే 1971 నాటి ఘనట మీద పెరియాడ్ మీద విమర్శలు చేయడం మాత్రం కొన్ని వర్గాలకు దగ్గరకావడానికే. ఒక విధంగా ద్రావిడ భావజాల మద్దతుదారుల్లో చిచ్చురేపారు.
రజనీకాంత్ కొత్త పార్టీ తమిళనాడులో కాకనురేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత రాజకీయ శూన్యత వచ్చింది. ఎవరు అందుకొంటే వాళ్లే పొలిటికల్ సూపర్ స్టార్లన్న వాదన వినిపించింది. కమల్ హాసన్ ముందడుగువేసినా, రజనీ మాత్రం చర్చలతోనే కాలయాపన చేశారు. మళ్లీ షూటింగ్ లన్నారు. ఎన్నికల ముందు అదునుచూసి రాజకీయ బరిలోకి దిగుతున్నారు.