Rajnath Singh : రక్షణరంగంలో పరిశోధనలకు రూ.499 కోట్లు

రానున్న ఐదేళ్లలో రక్షణ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణల కోసం దాదాపు 499 కోట్ల రూపాయల బడ్జెట్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆమోదం తెలిపారు.

Rajnath Singh : రక్షణరంగంలో పరిశోధనలకు రూ.499 కోట్లు

Rajnath Singh

Updated On : June 13, 2021 / 6:25 PM IST

Rajnath Singh రానున్న ఐదేళ్లలో రక్షణ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణల కోసం దాదాపు 499 కోట్ల రూపాయల బడ్జెట్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆమోదం తెలిపారు. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్(iDEX) -డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ (DIO) కు వచ్చే ఐదేళ్లకు రూ.498.8 కోట్ల బడ్జెట్ మద్దతును రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదించినట్లు మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

రక్షణ రంగంలో స్వావలంబన లక్ష్యంతో దాదాపు 300 స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME),వ్యక్తిగత ఆవిష్కర్తలకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సైనిక హార్డ్‌వేర్‌, ఆయుధాల దిగుమతులను తగ్గించి, భారతదేశాన్ని రక్షణ తయారీ కేంద్రంగా మార్చాలన్న ప్రభుత్వ ప్రయత్నంతో ఈ పథకం సమకాలీకరిస్తోందని తెలిపింది.

రక్షణ, ఏరోస్పేస్ రంగంలో ఆవిష్కరణ, సాంకేతిక అభివృద్ధిని పెంపొందించడానికి మరియు పర్యావరణ వ్యవస్థను సృష్టించడం లక్ష్యంగా రక్షణ ఉత్పత్తి విభాగం (DDP) ఐడెక్స్ ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు, డీఐఓను ఏర్పాటు చేసిన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. రక్షణ, ఏరోస్పేస్ రంగంలో స్వావలంబన మరియు స్వదేశీకరణ ప్రాథమిక లక్ష్యం ఐడెక్స్-డీఓఓకు ఉందని తెలిపింది.